కాసిపేట : మంచిర్యాల జిల్లా కాసిపేట( Kasipet ) మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ ( MLA Vinod ) సహకారంతో కాసిపేట మండల అధ్యక్షులు రత్నం ప్రదీప్ మధ్యాహ్న భోజన (Midday meal ) కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కళాశాలలో రత్నం ప్రదీప్, నాయకులు విద్యార్థులకు భోజనం వడ్డించి ప్రారంభించారు.
260 మంది విద్యార్థుల కోసం ఎమ్మెల్యే సహకారంతో భోజనం అందిస్తున్నామని, ఈ ఏడాది మొత్తం మధ్యాహ్న భోజనం కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి మైదం రమేష్, ఎస్సీ సెల్ అధ్యక్షులు గోలేటి స్వామి, రాజమౌళి, జైన్ ఆనందం, దాసరి సల్మాన్ రాజ్, మడావి వెంకటేష్, అక్కెపల్లి రాజేష్, ప్రిన్సిపాల్ నైతం శంకర్, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.