Nagoba Temple | నాగోబా ఆలయంలో కొత్త పంటలతో మెస్రం వంశీయుల పూజలు
Nagoba Temple | ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ గ్రామంలోని పురాతన నాగోబా ఆలయం లో మెస్రం వంశీయుల ఆధ్వర్యంలో నోవాంగ్(కొత్త పంటల) తో పూజలు నిర్వహించారు.
ఇంద్రవెల్లి : ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ గ్రామంలోని పురాతన నాగోబా ఆలయం( Nagoba Temple ) లో మెస్రం వంశీయుల ఆధ్వర్యంలో నోవాంగ్(కొత్త పంటల) తో పూజలు నిర్వహించారు. తమ పంట పొలాల్లో పండించిన చిరు ధాన్యాలతో పాటు పప్పు దినుసులతో ప్రత్యేక పూజలు చేసి, నైవేద్యాలు సమర్పించారు.
కొత్తగా పండించిన పంటలను మొదటగా తమ కుల పెన్ దేవతలకు సమర్పిస్తామని, ఆ తర్వాతే తాము తింటామని ఆదివాసీ పెద్దలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాగోబా ఆలయ పీఠాధిపతి మెస్రం వెంకటరావ్, మెస్రం బాధిరావ్ , కటోడ మెస్రం కోసేరావు, ప్రధాన్ మెస్రం దాదిరావ్ , మెస్రం చిన్నుపటేల్, మెస్రం తిరుపతి. మాజీ సర్పంచ్ మెస్రం నాగనాథ్, మెస్రం పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

