మంచిర్యాల : మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నస్పూర్లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ( BR Ambedkar ) క్రికెట్ టోర్నమెంట్ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా నస్పూర్ మాజీ మున్సిపల్ చైర్మన్ సురిమిల్ల వేణు ( Surimilla Venu) పాల్గొని క్రీడాకారులను పరిచయం చేసుకుని పోటీలను ప్రారంభించి, క్రికెట్( Cricket) ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. అనంతరం అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేశారు.
ఆయన మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని సూచించారు. క్రీడలతో మానసిక ఉల్లాసం కలుగుతుందని, తాము చేసే పనిలో చురుకుదనం పెరుగుతుందని అన్నారు. క్రీడాకారులు క్రమశిక్షణతో ఆటలు కొనసాగిస్తూ తమ తమ జట్ల గెలుపు కోసం పాటుపడాలని కోరారు. టోర్నీలో పాల్గొంటున్న ఇరు జట్లకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రాచకొండ గోపాల్ రావు, మాజీ కౌన్సిలర్ సీపతి సుమతిమల్లేష్, నాయకులు సంపత్ రెడ్డి, ఇరికిల్ల పురుషోత్తం, కొయ్యల కొమురయ్య, కొప్పర్తి రాజం, మున్సిపల్ బిల్ కలెక్టర్ శ్రీపతి సురేష్ కుమార్, ఆర్గనైజింగ్ సభ్యులు గొడిశెల లవ, ఫారూక్ , రమేష్ , ఉమర్ తదితరులు పాల్గొన్నారు.