మంచిర్యాల అర్బన్, జనవరి 29 : యాదవుల అభివృద్ధి, సంక్షేమం కోసం యాదవ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు మేకల రాములు యాదవ్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలో జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి జిల్లా కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై రాష్ట్ర అధ్యక్షుడు శెట్టి వంశీమోహన్ యాదవ్‌తో కలిసి ఆయన మాట్లాడారు.
రెండో విడుత గొర్రెల పంపిణీని వెంటనే చేపట్టాలన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో మొదటి విడుత డీడీలు తీసిన వారికి గొర్రెల యూనిట్లు అందజేయగా, రెండో విడుత డీడీలు తీసిన గొల్లకుర్మలకు వెంటనే గొర్రెల యూనిట్లు పంపిణీ చేయాలని కోరారు. గొల్లకుర్మలు ఐక్యంగా ఉండి హక్కులు సాధించుకోవాలని పిలుపునిచ్చారు.
జిల్లా అధ్యక్షుడు పెండ్లి అంజయ్య యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు గిరివేన సంపత్ యాదవ్, రాష్ట్ర కార్యదర్శి గడ్డం సతీష్ యాదవ్, రాష్ట్ర అధికార ప్రతినిధి గుడి సె శ్రీనివాస్ యాదవ్, రాష్ట్ర నాయకులు వెం కటేశ్ యాదవ్, శ్రీశైలం యాదవ్, జిల్లా ప్రధా న కార్యదర్శి శ్యాంయాదవ్, మల్లేశ్ యాదవ్, పర్ల రాజన్న యాదవ్, యూత్ అధ్యక్షుడు చీర్ల శశిందర్ యాదవ్ పాల్గొన్నారు.