భైంసా, డిసెంబర్ 4 : పట్టణంలోని అల్ఫోర్స్ పాఠశాలలో ఆదివారం మ్యాథ్స్ ఒలింపియాడ్ టెస్టు నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుత పోటీ ప్రపంచంలో గణిత శాస్త్రం చాలా కీలకంగా మారిందని, ఇందులో పట్టు సాధించిన వారికి అనేక ఉపాధి అవకాశాల్లో విజయం సాధించడంతో పాటు ఉత్తమంగా ఉండవచ్చన్నారు. ఇందులో నైపుణ్యం సాధించిన విద్యార్థులకు రామానుజం జయంతి నాడు బహుమతులు అందజేస్తామని తెలిపారు. ఇక్కడ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
నిర్మల్ అర్బన్, డిసెంబర్ 4 : పట్టణంలోని ఆదర్శనగర్లో ఉన్న అల్ఫోర్స్ పాఠశాల, జూనియర్ కళాశాలలో గణిత ఒలింపియాడ్ పరీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శ్రీనివాస రామానుజన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. గణిత రంగంలో ఆయన చేసిన సేవలను కొనియాడారు. అనంతరం నిర్వహించిన గణిత ఒలింపియాడ్ పరీక్షలో నిర్మల్ జిల్లా నుంచి దాదాపు 1600 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారని విద్యా సంస్థల చైర్మన్ నరేందర్రెడ్డి పేర్కొన్నారు. ఈ పరీక్షను 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు నిర్వహించినట్లు తెలిపారు. ఇందులో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ఈ నెల 18న కరీంనగర్లో తుది దశ పరీక్ష నిర్వహించనున్నట్లు చెప్పారు. విజేతలకు జాతీయ గణిత దినోత్సవ వేడుకల్లో పురస్కార ప్రదానం ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో అల్ఫోర్స్ విద్యాసంస్థల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.