తాండూర్, అక్టోబర్ 13 : పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడిగా తాండూర్ మండలానికి చెందిన మాసాడి శ్రీరాములు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు తిరమల్రెడ్డి ఇన్నారెడ్డి, రవి తెలిపారు. హైదరాబాద్లో 7న జరిగిన పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు పేర్కొన్నారు.
రాష్ట్ర అసోసియేట్ మహిళా అధ్యక్షురాలిగా బీ జయప్రద, రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా వెంకటేశ్వర్రావు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా ప్రదీప్ ఎన్నికైనట్లు తెలిపారు. పీఆర్టీయూ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సంబరం శ్రీనివాస్, మధుసూదన్, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు .