సీసీసీ నస్పూర్, మే 1: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కార్మికుల పక్షపాతి అని, ఈ మేరకు సింగరేణి కార్మికులకు అనేక హక్కులు కల్పించారని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు పేర్కొన్నారు. గురువారం సీసీసీ నస్పూర్‌లో మేడే వేడుకలను ఘనంగా నిర్వహించారు. నస్పూర్కాలనీలోని టీబీజీకేఎస్ కార్యాలయం వద్ద శ్రీరాంపూర్ ఏరియా ఉపాధ్యక్షుడు పెట్టం లక్ష్మణ్ జెండాను ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్‌రావు, టీబీజీకేఎస్ యూనియన్ కేంద్ర ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్‌రెడ్డి, డిప్యూటీ ప్రధాన కార్యదర్శి బండి రమేశ్, నడిపల్లి ట్రస్ట్ చైర్మన్ విజిత్‌రావు, బీఆర్ఎస్ పట్టణ పార్టీ అధ్యక్షుడు అక్కూరి సుబ్బయ్య, తదితరులు పాల్గొని చికాగో అమరవీరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చికాగో అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని కొనియాడారు. వారి పోరాట ఫలితంగానే కార్మికులకు అనేక హక్కులు కల్పించబడ్డాయని తెలిపారు.
గత సీఎం కేసీఆర్ ప్రభుత్వ హయాంలో కార్మికులకు ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని హామీలను అమలు చేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు పానుగంటి సత్తయ్య, పొగాకు రమేశ్, అన్వేష్‌రెడ్డి, గడ్డం మహిపాల్‌రెడ్డి, ఎండీ లాలా, తొంగల రమేశ్, గొర్ల సంతోష్, మేరుగు పవన్, వంగ తిరుపతి, మారం ఉత్తేజ్‌రెడ్డి, బుడ్డి ప్రసాద్, వెంకట్‌రెడ్డి, ఉప్పల సంపత్, దుర్గం రవికుమార్, మేడం తిరుపతి, గడ్డం సుధాకర్, గురుమూర్తి, వెంగల కుమారస్వామి, లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.