జైనథ్, ఫిబ్రవరి 5: రాష్ట్రంలో పరిపాలన సౌలభ్యం కోసమే నూతన మండలాల ఏర్పాటు చేశామని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ప్రభుత్వం మండలాల ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా బుధవారం భోరజ్, సాత్నాల నూతన మండలాలకు సంబంధించిన తహసీల్దార్, ఎంపీడీవో ప్రభుత్వ కార్యాలయాలను కలెక్టర్ రాజర్షి షా ప్రారంభించారు. ఈ సందర్భంగా భోరజ్‌కు వచ్చిన కలెక్టర్‌ను పూలవర్షంతోపాటు డప్పుచప్పుళ్ల మధ్య ప్రజలు, అధికారులు స్వాగతం పలికారు. భోరజ్ తహసీల్దార్‌గా రాథోడ్ రాజేశ్వరి, భోరజ్ మండల ఎంపీడీవోగా వేణు, సాత్నాల మండల తహసీల్దార్‌గా మడావి విశ్వనాథ్, ఎంపీడీవోగా వెంకట్రాజ్లు కలెక్టర్ సమక్షంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ శ్యామలదేవి, అసిస్టెంట్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వీయ, ఆదిలాబాద్ ఆర్డీవో వినోద్ కుమార్, జడ్పీ సీఈవో జితేందర్‌రెడ్డి, కలెక్టరేట్ సూపరింటెండెంట్ రాంరెడ్డి పాల్గొన్నారు.
ఎదులాపురం, ఫిబ్రవరి 5 : జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవాన్ని విజయవంతం చేయాలని, ఆరోగ్యవంతమైన పిల్లల కోసం ఆల్బెండజోల్ మాత్రలను వేయించాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. బుధవారం కలెక్టర్ సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవాన్ని ఈనెల నిర్వహిస్తున్నట్లు పేరొన్నారు. 1-19 సంవత్సరాల వయస్సు ఉన్న పిల్లలందరికీ ఆల్బెండజోల్ మాత్రలను కళాశాలలు, పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల వద్ద ఉచితంగా వేస్తారన్నారు. 10 తేదీన తప్పిపోయిన పిల్లలకు ఈనెల 17వ తేదీన ఇస్తారన్నారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి నరేందర్ రాథోడ్, డీఐవో వైసీ శ్రీనివాస్, డీఈవో ప్రణీత, డిప్యూటీ డీఎంహెచ్‌వో సాధన, అడిషనల్ డీఎంహెచ్‌వో డాక్టర్ గజనన్ పాల్గొన్నారు.
పుస్తకాలు చదవడంతో జ్ఞానంతోపాటు ఆలోచన శక్తి పె రుగుతుందని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని గర్ల్స్ హైసూల్లో నేషనల్ బుక్ ట్రస్ట్ ఇండియా ఆధ్వర్యంలో మొబైల్ పుస్తక పరిశ్రమ వ్యాన్ ను ఏర్పాటు చేశారు. కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం అందులోని పుస్తకాలను పరిశీలించి అభినందించారు. అదేవిధంగా ఎన్ఆర్ఐ వా సుల తరఫున పాఠశాలలో ఏర్పాటు చేసిన లైబ్రరీని కూ డా కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జ్ఞానం, ఆలోచన శక్తి పెరగాలంటే ని త్యం పుస్తకాలు చదవాలన్నారు. మహనీయులు, స్వతం త్య్ర సమరయోధుల జీవిత చరిత్రలను చదవాలని సూ చించారు. నేషనల్ బుక్ ట్రస్ట్ ఇండియా నాలుగు రోజులపాటు పుస్తక ప్రదర్శనతోపాటు అమ్మకాలు చేపడుతుందన్నారు. డీఈవో ప్రణీత, ఎంఈవో సోమయ్య, లక్ష్మిపూర్ హెచ్ఎం కోరెడ్డి అశోక్, హెచ్ఎం రమేశ్ రెడ్డి, సెక్టోరియల్ అధికారి సుజాత్ ఖాన్ పాల్గొన్నారు.