హైదరాబాద్ : మంచిర్యాల జిల్లా కోటపల్లి మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో చదువుతూ ఈ నెల 5వ తేదీన అదృశ్యమైన ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థిని కేసులో నాటకీయ పరిణామం చోటు చేసుకుంది. చదువు ఇష్టం లేక కాలేజ్ నుండి పారిపోయిన విద్యార్థిని మూడు రోజులు ఫ్రీ బస్సులో చక్కర్లు కొట్టింది.
కోటపల్లి నుండి ద్విచక్రవాహనంపై లిఫ్ట్ అడిగి చెన్నూరు వెళ్లి ఆధార్ కార్డుతో ఫ్రీ బస్సులో చెన్నూరు నుండి మంచిర్యాల, మంచిర్యాల నుండి ఆదిలాబాద్, ఆదిలాబాద్ నుండి మంచిర్యాల, మంచిర్యాల నుండి కరీంనగర్ వచ్చింది. కరీంనగర్ నుండి హైదరాబాద్ వెళ్తుండగా పోలీసులు విద్యార్థినిని అడ్డుకుని తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు.