 
                                                            తాండూర్, అక్టోబర్ 31 : తాండూర్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం రాష్ట్రీయ ఏక్తా దివస్ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.ఈ కార్యక్రమానికి మంచిర్యాల జిల్లా తాండూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ దేవయ్య ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకొని రన్ ఫర్ యూనిట్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. నిజాం రజాకార్లను తరిమికొట్టి స్వతంత్ర భారతదేశంలో తెలంగాణను ఐక్యత చేసిన భారత దేశ తొలి హోం మంత్రి మాజీ ఉప ప్రధాని ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకోవడం ఎంతో సంతోషకరమన్నారు.
ఆయన స్ఫూర్తితో మనమందరం ఐకమత్యంతో ముందుకెళ్లాలన్నారు. అనంతరం మాదారం పోలీస్ స్టేషన్ క్రీడా ప్రాంగణం నుండి ఐబి జాతీయ రహదారి మీదుగా ఆంధ్ర బ్యాంకు నుండి 2 కె రన్ కార్యక్రమాన్ని నిర్వహించగా తాండూర్ ఎస్సై కిరణ్ కుమార్, ఎస్సై సౌజన్య తో పాటు నాయకులు, యువకులు, క్రీడాకారులు విద్యార్థులు, పోలీస్ సిబ్బంది, వాకర్సు క్లబ్ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
 
                            