Police searche | అర్ధరాత్రి రౌడీషీటర్ల ఇళ్లలో పోలీసుల తనిఖీలు
శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా మంచిర్యాల పట్టణంలోని తిలక్‌నగర్‌లో పోలీసులు గురువారం అర్ధరాత్రి రౌడీషీటర్ల ఇళ్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
మంచిర్యాల అర్బన్, అక్టోబర్ 29 : శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా మంచిర్యాల పట్టణంలోని తిలక్‌నగర్‌లో పోలీసులు గురువారం అర్ధరాత్రి రౌడీషీటర్ల ఇళ్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు మంచిర్యాల డీసీపీ ఎ.భాస్కర్, ఏసీపీ ఆర్.ప్రకాష్, ఇన్స్పెక్టర్ ప్రమోద్ రావు ఆధ్వర్యంలో ఈ తనిఖీలు చేపట్టారు. రౌడీషీటర్ల ప్రస్తుత పరిస్థితి, కార్యకలాపాలు, ప్రవర్తనను పరిశీలించిన అధికారులు వారికి కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీపీ ఎ.భాస్కర్ మాట్లాడుతూ రౌడీషీటర్లు చట్టవ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, గొడవలు, బెదిరింపులు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమాజంలో బాధ్యతాయుతమైన పౌరులుగా జీవిస్తూ, ప్రశాంత వాతావరణానికి సహకరించాలని సూచించారు.
రౌడీషీటర్లు తమ ప్రవర్తనను మార్చుకొని, భవిష్యత్తులో ఎలాంటి నేరాలకు పాల్పడకుండా సత్ప్రవర్తనతో జీవిస్తే నిబంధనల ప్రకారం రౌడీషీట్ల తొలగింపును పరిశీలిస్తామని తెలిపారు. అదే సమయంలో తిరిగి నేరాలకు పాల్పడినా, అసాంఘిక శక్తులతో సంబంధాలు కొనసాగించినా, ప్రజలకు ఇబ్బందులు కలిగించినా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. అవసరమైన సందర్భాల్లో నిబంధనల ప్రకారం రౌడీషీట్లు తెరిచే చర్యలు చేపడతామని పేర్కొన్నారు. రౌడీషీటర్ల కదలికలు, ప్రవర్తనపై పోలీసుల నిఘా నిరంతరం కొనసాగుతుందని డీసీపీ వెల్లడించారు. ప్రజల భద్రతకు, శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తున్నామని, అసాంఘిక కార్యకలాపాలకు సంబంధించిన సమాచారం తెలిస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు తెలియజేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజల సహకారంతో నేరరహిత, ప్రశాంత వాతావరణాన్ని బలోపేతం చేస్తామని తెలిపారు.
Read Today's Latest Adilabad Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Baththa Out on Netflix | ఓటీటీలోకి విజయ్ సేతుపతి ‘బత్తా’.. తెలుగులోనూ అందుబాటులోకి వచ్చిన సినిమా!
Katrina Kaif | ‘బౌన్స్ బ్యాక్ అవ్వాలా? ఎందుకు?’.. ట్రోలింగ్‌కు కత్రినా కైఫ్ గట్టి సమాధానం!
Chiru-Kamal | ఓటీటీలోకి మెగాస్టార్ చిరంజీవి.. ‘మెగావర్స్’లో కమల్ హాసన్‌తో సందడి చేయనున్నారా?
US Fed Meeting | వడ్డీరేట్లను యథాతథంగా ఉంచిన అమెరికా కేంద్ర బ్యాంక్..!
Srikanth Odela | ‘ది ప్యారడైజ్’ విమర్శలు.. శ్రీకాంత్ ఓదెల నెక్స్ట్ మూవీపై ఆసక్తికర చర్చ!
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

