నెన్నెల: నెన్నెలలో (Nennela) నెల రోజులుగా అనుకున్నంత వర్షం పడక పోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటివరకు లోటు తప్ప అధిక వర్షం కురువలేదు. చెరువులు, కుంటలు నీళ్లు లేక వెల వెల బోతున్నాయి. బోర్ల ఆధారపు పంటలు తప్ప చెరువు, కుంటలు, వర్షధార పంటలు పండవని రైతులు ఆందోళన చెందుతున్నారు. బోరు ఉన్న రైతులు మినహా ఇతర రైతులు ఎవరూ ఇప్పటి వరకు వరి నారు పోయలేదు. అక్కడక్కడ నారు పోసిన రైతుల నారు మల్లు, నీటి తడి లేక ఎండి పోతున్నాయి.
ఇప్పటికే నారు మల్లు పోయడం ఆలస్యం అయ్యిందని, నారు పోయడం ఆలస్యమైతే నాట్లు ఆలస్యం అవుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. నారు మడి పోసుకున్నా నీళ్లు రాకపోతే నారు ఎండి పోతుందని, పూర్తి స్థాయిలో నీళ్లు వచ్చేటప్పటికి నాట్లు వేద్దామనా నారు ముదిరిపోయే అవకాశం ఉందని రైతులు అంటున్నారు. వర్షధారంగా సాగు చేసే వరి మండలంలో 10 శాతం కుడా సాగుకు నోచుకోలేదు. పొలాలన్నీ ప్రస్తుతం బీళ్లుగా ఉన్నాయి. చెరువులు, కుంటలు నీళ్లు లేక బోసిపోతున్నాయి.