Road Accident : దండేపల్లి మండలంలోని తాళ్లపేట ప్రధాన రహదారి వద్ద శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం జన్నారం మండలం రాంపూర్ గ్రామానికి చెందిన కోల మల్లయ్య (65) శనివారం సాయంత్రం తాళ్లపేటకు ద్విచక్ర వాహనంపై వచ్చాడు.
తాళ్లపేట ప్రధాన రహదారిపై నుండి వెళుతుండగా అతడు బైక్ అదుపుతప్పడంతో రోడ్డుపై పడిపోయాడు. అప్పుడే వెనకాల నుండి వచ్చిన లారీ అతని ఢీకొట్టింది. దాంతో.. మల్లయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్సై తహసీనుద్దీన్ ప్రమాదం జరిగిన తీరును పరిశీలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.