కాసిపేట, నవంబర్ 9 : మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలోని స్టేషన్ పెద్దనపల్లి ఎంపీయూపీఎస్ పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలుగా విధులు నిర్వహిస్తున్న జి శారద శాస్త్రీయ నృత్యంలో ఇచ్చిన ఉత్తమ ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సెక్రటేరియట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అఖిల భారత సర్వీస్ సంగీత నృత్య, నాటక పోటీలను నిర్వహించారు.
ఈ పోటీల సందర్భంగా శాస్త్రీయ నృత్య విభాగంలో కాసిపేట మండలంలోని పెద్దనపల్లి ఎంపీయూపీఎస్ పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలుగా విధులు నిర్వహిస్తున్న జి శారద ఉత్తమ ప్రదర్శన చేసి ప్రతిభ కనబరిచారు. ఈ మేరక తెలంగాణ సెక్రటేరియట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ జాయింట్ సెక్రెటరీ నీర జాక్షి చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి ముక్తవరం వెంకటేశ్వరస్వామి, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు మామిడిపల్లి సాంబమూర్తి, మండల ఉపాధ్యాయులు అభినందించారు.