నెన్నెల : తమ ఊరుకు దారి సక్కగ లేదని, మోకాలులోతు బురదలో నీటి మడుగుల నడుమ నడవాల్సి వస్తుందని నెన్నెల మండలం చిన్న వెంకటాపూర్ గ్రామపంచాయితీ పరిధిలోని కొంపల్లి గ్రామానికి చెందిన ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంకెన్నాళ్లు తమకు ఈ ఇబ్బందులు అంటూ గ్రామానికి చెందిన పలువురు మహిళలు బురద బాటపై వరినాట్లు వేసి నిరసన తెలిపారు.
కొంపల్లి గ్రామానికి రోడ్డు సౌకర్యం లేదు. ఏమాత్రం వర్షం పడినా బాట బురదమయమై గ్రామస్తులకు రవాణా సౌకర్యం లేకుండా పోతున్నది. చుట్టూ చెరువు కట్టలు, పంటపొలాలు ఉన్నాయి. ఎటు వెళ్ళాలన్నా కిలోమీటరుకుపైగా బురదలో నడవాల్సి వస్తుంది. పిల్లలు పాఠశాలకు బురదలో, నీటి మడుగుల్లోనే వెళ్ళాలి. ఏటా ఒకటి రెండు రోజులు కాదు, దాదాపు అయిదు నెలలు ఇబ్బందులు పడాల్సి వస్తుంది.