కోటపల్లి : ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IITH) లో రూరల్ డెవలప్ సెంటర్ అండ్ ప్రయాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన సృష్టి సైన్స్ ఫెయిర్-2025 లో(Srishti Science Fair-2025) మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం అన్నారం ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు సత్తాచాటారు. పాఠశాలకు చెందిన పి శ్రావణ్, జె శ్రవణ్, చరణ్ తేజ వారి గైడ్ ఎస్.సురేందర్ ఆధ్వర్యంలో పాల్గొని ఉత్తమ ప్రదర్శన చేసి ఏడవ స్థానంలో నిలిచి ఫ్యూచర్ ఇన్నోవేటివ్ ప్రోగ్రాంకి ఎంపికయ్యారు.
జిల్లాలోనే మారుమూల గ్రామం అయిన అన్నారం పాఠశాలను సైన్స్ ప్రదర్శనల ద్వారా జాతీయ స్థాయికి తీసుకెళ్తూ పేద విద్యార్థులలోని ప్రతిభను వెలికి తీస్తున్న పాఠశాల ఉపాధ్యాయులు సురేందర్ ను తోటి ఉపాధ్యాయులు, గ్రామస్తులు అభినందించారు. రానున్న రోజుల్లో సైన్స్ ఆవిష్కరణల ద్వారా మరిన్ని ప్రదర్శనలు చేయాలని ఆకాక్షించారు.