బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య
మాదారం టౌన్షిప్లో పల్లె ప్రకృతి వనం ప్రారంభం
తాండూరు, ఆగస్టు 18 : ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల వెన్నంటే ఉంటున్నారని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. మండలంలోని మాదారం టౌన్షిప్లో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనాన్ని బుధవారం ఆయన ప్రారంభించారు. అందులోని అంబేద్కర్, బుద్ధుడి విగ్ర హాలు, మాదారం సెంటర్లో ఏర్పాటు చేసిన గాంధీ విగ్రహాన్ని ఎమ్మెల్యే, బెల్లంపల్లి ఎస్వోటూ జీఎం సాయిబాబా, టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి ఆవిష్కరించారు. అభివృద్ధిలో మాదారం టౌన్షిప్ నియోజకవర్గంలోనే మొదటి స్థానంలో ఉందని ప్రశంసించారు. పార్కులో ఏర్పాటు చేసిన కళాకృతులు, బొమ్మలను చూసి సర్పంచ్ సాగరికను అభినందించారు. కార్యక్రమంలో ఎంపీపీ పూసాల ప్రణయ్‌కుమార్, వైస్ ఎంపీపీ దాగం నారాయణ, టీబీజీకేఎస్ చర్చల కమిటీ ప్రతినిధి మంగీలాల్, ఏరియా ఉపాధ్యక్షుడు శ్రీనివాస్‌రావు, ఎంపీటీసీలు సిరంగి శంకర్, మొగిలి శంకర్, సర్పంచ్‌లు అస్ప రమేశ్, క్రిష్టోఫర్, రైతు బంధు సమితి అధ్యక్షుడు దత్తాత్రేయరావు, ఎంపీవో అక్తర్ మొయినొద్దీన్, ఉపసర్పంచ్ ఆసియా, కార్యదర్శి సౌందర్య, కో ఆప్షన్ సభ్యులు కత్తెర్ల ఎర్రయ్య, ఏములకుర్తి రమాదేవి, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షురాలు ఎరుకల రాజమణి, యూత్ ప్రెసిడెంట్ శ్రావణ్‌కుమార్, నాయకులు పాల్గొన్నారు.
దేశీ డీలర్లకు సర్టిఫికెట్లు అందజేత
బెల్లంపల్లిరూరల్, ఆగస్టు 18: బెల్లంపల్లి కృషి విజ్ఞానకేంద్రంలో దేశీ డీలర్లకు వ్యవసాయ డిప్లొమా కోర్సుకు సంబంధించిన సర్టిఫికెట్లను ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ రాజేశ్వర్‌నాయక్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. వ్యవసాయ రంగంలో డిప్లొమా కోర్సు పూర్తి చేసిన దేశీ డీలర్లు రైతులకు తమ సేవలు అందించాలని కోరారు. డీలర్లు ఏడాది పాటు నేర్చుకున్న విషయాలను రైతు సేవ కోసం నిబద్ధతతో ఉపయోగించాలని ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ రాజేశ్వర్‌నాయక్ సూచించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి వినోద్‌కుమార్, బెల్లంపల్లి వ్యవసాయ ఏడీఏ సురేఖ, దేశీ డీలర్ల అనుసంధాన వేత్త శంకర్‌గౌడ్, ఏవో ప్రేమ్‌కుమార్, శాస్త్రవేత్తలు డాక్టర్ శివకృష్ణ, డాక్టర్ తిరుపతి, డాక్టర్ స్రవంతి, డాక్టర్ సతీశ్ కుమార్, దేశీ డీలర్లు నాయకులు పాల్గొన్నారు.