చిత్రపటాలకు పూలమాలలు, ఘన నివాళులు..
దండేపల్లి, ఆగస్టు 18 : బహుజన ప్రజారాజ్య నిర్మాత సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 371వ జయంతిని దండేపల్లి మండల కేంద్రంలో బుధవారం గౌడ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పాపన్న చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు. దళిత బహుజనులు ఏకమై పోరాడితే రాజ్యాధికారం సాధించవచ్చని నిరూపించిన వీరుడు పాపన్నగౌడ్ అని కొనియాడారు. భూస్వామ్య దోపిడీ వ్యవస్థపై తిరుగుబాటు చేసిన గొప్ప వ్యక్తి అని అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం మండలాధ్యక్షుడు బండి రవి గౌడ్, సభ్యులు పాల్గొన్నారు.
చెన్నూర్, ఆగస్టు 18 : చెన్నూర్ పట్టణంలో గౌడ సంఘం నాయకులు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటానికి పూల మాలలు వేసి, నివాళులర్పించారు. గౌడ సంఘం అధ్యక్షుడు కుర్మ అశోక్ గౌడ్, కోటపల్లి పీఏసీఎస్ చైర్మన్ పెద్దపోలు సాంబాగౌడ్, గౌడ సంఘం ఉపాధ్యక్షుడు మోహన్ గౌడ్, గౌడ కులస్తులు మారగోని మధూకర్ గౌడ్, లక్ష్మీరాజాగౌడ్, శ్రీకాంత్ గౌడ్, పొన్నం లస్మాగౌడ్, సృజన్ గౌడ్, మహేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
జన్నారం, ఆగస్టు 18 : మండల కేంద్రంలో తెలంగాణ గౌడ జన హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గౌడ జన హక్కుల పోరాట సమితి (మోకుదెబ్బ) జిల్లా అధ్యక్షుడు బాలసాని శ్రీనివాస్‌గౌడ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సిటిమల భరత్‌కుమార్, నాయకులు ఫసియుల్లా, మోకు దెబ్బ నాయకులు నర్సాగౌడ్, నాయిని సత్యగౌడ్, రమేశ్‌గౌడ్, నాగన్నగౌడ్, రమేశ్‌గౌడ్ పాల్గొన్నారు.
కన్నెపల్లి, ఆగస్టు 18 : మండల కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో గౌడ సంఘం మండలాధ్యక్షుడు గడ్డం భీమేశ్ గౌడ్, ప్రధాన కార్యదర్శి పూదరి శంకర్ గౌడ్, గ్రామ అధ్యక్షుడు లగ్గ శంకర్ గౌడ్, జిల్లెల మల్లాగౌడ్, లగ్గా బాపు గౌడ్, బొల్లంపల్లి సత్యనారాయణ, పూదరి వెంకగౌడ్, చంద్రమోహన్ గౌడ్, జిల్లెల శ్రీకాంత్ గౌడ్ పాల్గొన్నారు.
మంచిర్యాల అర్బన్, ఆగస్టు 18 : పట్టణంలోని ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్‌లో తెలంగాణ బీసీ జాగృతి ఆధ్వర్యంలో పాపన్న చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు. ఆయన జీవిత చరిత్రను పాఠ్య పుస్తకాల్లో చేర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ జాగృతి అధ్యక్షుడు నరెడ్ల శ్రీనివాస్, కార్యదర్శి గుమ్ముల శ్రీనివాస్, పట్టణాధ్యక్షుడు మడుపు రాంప్రకాశ్, బొలిశెట్టి లక్ష్మణ్, సంతోష్, సదానందం, మహేశ్, శ్రీనివాస్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.