అంకితభావంతో విధులు నిర్వర్తించాలి
ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలి
పోలీసులకు రామగుండం సీపీ
చంద్రశేఖర్‌రెడ్డి సూచనలు
కోటపల్లి, ఆగస్టు 14 :మహారాష్ట్రలో మావోయిస్టుల కదలికలు ఉన్న నేపథ్యంలో సరిహద్దు భద్రతపై ప్రత్యేక దృష్టిసారించాలని రామగుండం పోలీస్ కమిషనర్ చంద్రశేఖర్‌రెడ్డి సూచించారు. కోటపల్లి, వేమనపల్లి, చెన్నూర్, భీమారం ఠాణాలను ఆయన శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీసులకు పలు సూచనలు చేశారు. కేసుల వివరాలు, సీసీ కెమెరాల పనితీరు, నేరాల నియంత్రణ, రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న చర్యలు తెలుసుకున్నారు. పోలీసులు అంకితభావంతో పనిచేస్తూ.. ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని పేర్కొన్నారు.
మహారాష్ట్రలో మావోయిస్టుల కదలికల నేపథ్యంలో సరిహద్దు భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని సీపీ చంద్రశేఖర్ సూచించారు. కోటపల్లి, వేమనపల్లి మండలాల్లో శనివారం పర్యటించారు. కోటపల్లి పోలీస్‌స్టేషన్‌ను సందర్శిం చి నిర్మాణంలో ఉన్న పోలీస్ స్టేషన్ భవనాన్ని పరిశీలించారు. నాణ్యమైన పనులు చేపట్టాలని సూచించారు. సరిహద్దులలో నిఘా వ్యవస్థను మరింత పటిష్టం చేయడంతో పాటు సీసీ కె మెరాలను ఏ ర్పాటు చేయాలన్నారు. ఫిర్యాదుదారుల సమస్యలను ఓపిగ్గా విని పరిష్కరించాలని సూచించారు. పే కాట, గుట్కా నిషేధిత ఉత్పత్తులు అమ్మేవారిపై కఠినంగా వ్యవహరించాలన్నారు. కార్యక్రమంలో మం చిర్యాల డీసీపీ ఉదయ్ కుమార్ రెడ్డి, ఏసీపీ నరేందర్, చెన్నూర్ రూరల్ సీఐ నాగరాజు, ఎస్ఐ రవి కుమార్, శిక్షణ ఎస్ఐ శ్రీకర్, సిబ్బంది పాల్గొన్నారు.
అంకిత భావంతో విధులు నిర్వర్తించాలి
చెన్నూర్, ఆగస్టు 14: పోలీసులు అంకిత భావం తో విధులు నిర్వర్తిస్తూ ప్రజల మన్ననలు పొందాలని రామగుండం సీపీ ఎస్ చంద్రశేఖర్ రెడ్డి అ న్నారు. చెన్నూర్ పోలీస్‌స్టేషన్‌ను శనివారం తనిఖీ చేశారు. కేసుల వివరాలు, ఎలాంటి కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయని, సీసీ కెమెరాల పని తీరు, నేరాల నియంత్రణ, ప్రధాన రహదారులపై ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న చర్యలను సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదులపై తక్షణమే స్పందించి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. శాంతి భద్రతల పరిరక్షణకు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో డీసీపీ ఉదయ్‌కుమార్ రెడ్డి, ఏసీపీ నరేందర్, సీఐ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు.
ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలి
భీమారం ఆగస్టు 14 ప్రజా ఫిర్యాదులపై తక్షణ మే స్పందించాలని సీపీ చంద్రశేఖర్ రెడ్డి సూచించారు. భీమారం పోలీస్ స్టేషన్‌ను సందర్శించారు. పరిసరాలను పరిశీలించి పలు సూచనలు చేశారు. నేరాల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను ఎస్ఐ అశోక్‌ను అడిగి తెలుసుకున్నారు. సమన్వయంతో పని చేయాలని సూచించారు. కార్యక్రమంలో మంచిర్యాల డీసీపీ ఉదయ్ కుమార్ రెడ్డి , ఏసీపీ నరేందర్ , సీఐ సంజీవ్ పాల్గొన్నారు.
నీల్వాయి పోలీస్‌స్టేషన్ తనిఖీ..
వేమనపల్లి, ఆగస్టు 13 : మండలంలోని నీల్వా యి పోలీస్‌స్టేషన్‌ను రామగుండం సీపీ చంద్రశేఖర్‌రెడ్డి డీసీపీ ఉదయ్‌కుమార్‌రెడ్డి, జైపూర్ ఏసీపీ నరేందర్‌తో కలిసి తనిఖీ చేశారు. పరిసరాలను పరిశీలించారు. ప్రాణహిత పరీవాహక ప్రాంతంలోని ఫెర్రీ పాయింట్లు, మావోయిస్టు ప్రభావిత గ్రామాల వివరాలు, ప్రస్తుత పరిస్థితులు, నదిలో పడవలు నడిపే వారి వివరాలు, మావోయిస్టు సానుభూతిపరులు, మిలిటెంట్లు, మావోయిస్టుల కదలికలు ఉ న్నాయా..? అని..? తెలుసుకున్నా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విధు ల్లో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, మారుమూల ప్రాంతాల ప్రజా సమస్యలను , అవసరాలను తెలుసుకుని పరిష్కారానికి కృషి చేయాలన్నారు. అనంతరం స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. చె న్నూరు రూరల్ సీఐ నాగరాజు, కోటపల్లి ఎస్ఐ రవికుమార్, నీల్వాయి ఎస్ఐ రహీంపాషా పాల్గొన్నారు.