పట్టణ ప్రగతిలో సమస్యలన్నీ పరిష్కరించుకోవాలి
రాష్ట్ర మున్సిపల్ కమిషనర్ అండ్ డైరెక్టర్ సత్యనారాయణ
కాగజ్‌నగర్ రూరల్, జూలై 5: రాష్ర్టాన్ని పచ్చ గా తీర్చిదిద్దాలనే ప్రభుత్వ హరిత లక్ష్యాన్ని చేరుకు నేందుకు, ప్రతి ఒక్కరూ ఇందులో భాగస్వాముల వ్వాలని రాష్ట్ర మున్సిపల్ కమిషనర్ అండ్ డైరెక్టర్ సత్యనారాయణ అన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని వార్డు నం. 23 లోని చిల్డ్రెన్స్ పార్కులో సిర్పూరు ఎమ్మెల్యే కోనే రు కోనప్ప, కలెక్టర్ రాహుల్ రాజ్, అసిస్టెంట్ కలెక్టర్ వరుణ్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ సద్దాం హుస్సేన్‌తో కలిసి సోమవారం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హరిత లక్ష్యా న్ని నెరవేర్చేందుకు అందరూ సమన్వయంతో ముందడుగు వేయాలన్నారు. భూమిపై అడవులు తగ్గిపోతే వాతావరణ సమతుల్యత దెబ్బతిని ప్రకృతి విలయాలు వచ్చే అవకాశముంటుందని , అందుకే మొక్కలు నాటి సంరక్షించే బాధ్యతను తీసుకోవాలని సూచించారు. అనంతరం మెప్మా సిబ్బందితో మాట్లాడారు. వార్డు నం. 11లోని కా లనీ వాసులకు మొక్కలను అందజేశారు. వాటిని నాటి సంరక్షించాలని కోరారు. ఈ కార్యక్రమం లో రీజినల్ మున్సిపల్ డైరెక్టర్ అడ్మినిస్ట్రేషన్ ష హీద్ మసూద్ అలీ, మున్సిపల్ కమిషనర్ రాజు, మున్సిపల్ వైస్ చైర్మన్ గిరీశ్‌కుమార్, కౌన్సిలర్లు బొద్దున విద్యావతి, జైచందర్, మదన్, శివ, మున్సిపల్ సిబ్బంది, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
స్వాగతం పలికిన ఎమ్మెల్యే
రాష్ట్ర మున్సిపల్ శాఖ కమిషనర్ అండ్ డైరెక్టర్ సత్యనారాయణకు సిర్పూరు ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఆర్అండ్బీ గెస్ట్ హౌస్‌లో స్వాగతం పలికారు. మున్సిపల్ చైర్మన్ సద్దాం హు స్సేన్, మున్సిపల్ అధికారులు ఉన్నారు.