చెన్నూర్, జూన్ 30: నిరుపేదలకు సీఎంఆర్ఎఫ్ భరోసా కలిగిస్తున్నదని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. చెన్నూర్‌లోని క్యాంప్ కార్యాలయంలో మంచిర్యాల జడ్పీ చైర్పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి, ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌కుమార్‌తో కలిసి 130 మంది లబ్ధిదారులకు మంజూరైన రూ 40 లక్షల విలువైన చె క్కులను బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా విప్ సుమ న్ మాట్లాడుతూ అనారోగ్యంతో ప్రైవేట్ దవాఖానల్లో వైద్యం చేయించుకున్న నిరుపేదలు సీఎం సహాయ నిధికి దరఖాస్తు చేసుకుంటే ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకుంటుందన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేణుకుంట్ల ప్రవీణ్, మున్సిపల్ చైర్మ న్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, సింగల్‌విండో చైర్మన్లు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
నియోజవకర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో వేగం పెంచి, గడువులోగా పూర్తి చేయాలని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అధికారులను ఆదేశించారు. పట్టణంలోని క్యాంప్ కా ర్యాలయంలో పంచాయతీ రాజ్, రోడ్లు భవనాలు, మున్సిపల్, ఆరోగ్యశాఖ అధికారులతో బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. చెన్నూర్‌లో నిర్మిస్తున్న 300 డబుల్ బెడ్ రూం పనులను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. అలాగే మినీ ట్యాంక్ బండ్ , స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, పార్కులు, కూరగాయల మార్కెట్, ప్రధాన రహదారి విస్తరణ పనులపై అధికారులతో సమీక్షించారు. మందమర్రిలో నిర్మించను న్న బ్రిడ్జి అలైన్మెంట్ మార్పుపై కూడా అధికారులతో చర్చించారు. 63 నంబర్ జాతీయ రహదారి పనులు, జోడువాగుల వద్ద నిర్మించే అర్బన్ పార్కు పనులు, పర్యాటక అభివృద్ధి, అటవీ అనుమతుల గురించి సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష జరిపారు.శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.