మంచిర్యాల, ఏప్రిల్ 19(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రె స్ పార్టీలో మంత్రి పదవి రచ్చ కొనసాగుతూనే ఉన్నది. ఎమ్మెల్యేలు సమీక్షలు.. సమావేశాలు పక్కనపెట్టి పదవి దక్కించుకునే ప్రయత్నాల్లోనే ఉంటున్నట్లు తెలుస్తున్నది. శనివారం నిర్మల్ జిల్లాలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధిపై మంత్రి సీతక్క సమీక్ష నిర్వహించగా, మంచిర్యాల జిల్లాకు చెందిన ముగ్గురు అధికార పార్టీ ఎమ్మెల్యేలు గైర్హాజరవడం ఇం దుకు బలం చేకూరుస్తున్నది. గతవారం మినిస్టర్ పదవి విషయమై మంచిర్యాలలో నిర్వహించిన మీటింగ్‌లో స్థానిక ఎమ్మెల్యే పీఎస్ఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు అన్యా యం చేస్తే సహించేది లేదంటూ హెచ్చరించారు.
ఆ కుటుంబంలో ఇప్పటికే మూడు పదవు లు ఉన్నాయని, మరొకటి ఇస్తానంటే ఆదిలాబాద్‌కు అన్యాయం చేసేనట్లేనని ‘కాక’ కుటుంబాన్ని ఉద్దేశించి మాట్లాడారు. అదే రోజు జై పూర్ మండలంలో జరిగిన ఓ సమావేశంలో చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్, బెల్లంపల్లిలో ఎమ్మె ల్యే వినోద్ పీఎస్ఆర్ వ్యాఖ్యలను ఖండించారు. బీజేపీలో ఉంటే తాను కేంద్ర మంత్రిని అయ్యేవాడినని, సీఎం రేవంత్‌రెడ్డి పిలిస్తేనే పార్టీలోకి వచ్చానని వివేక్.. 70 ఏండ్లుగా కాం గ్రెస్ పార్టీలోనే తమ కుటుంబం ఉందని.. సీనియర్‌గా మంత్రి పదవి అడగడంలో తప్పేమిటని వినోద్ చెప్పుకొచ్చారు. ఈ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయంశంగా మారిన నేపథ్యంలో గత మంగళవారం హైదరాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సీ ఎల్పీ మీటింగ్‌కు మంచిర్యాల ఎమ్మెల్యేలు హా జరు కాలేదు.
బెల్లంపల్లి ఎమ్మెల్యే ఆలస్యంగా ఆ రోజు మధ్యాహ్నం సీఎల్పీ సమావేశానికి వెళ్లినప్పటికీ వివేక్, పీఎస్ఆర్ మొత్తానికే గైర్హాజరయ్యారు. మంత్రి పదవి విషయంలో పరస్పర ఆరోపణలు, అధిష్టానంపై చేసిన వ్యాఖ్య ల నేపథ్యంలో ఈ ఇద్దరినీ సమావేశానికి పార్టీ పెద్దలు రావొద్దన్నారంటూ, ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు కావాలనే సమావేశానికి వెళ్లలేదనే ప్రచా రం జరిగింది. ఈ మీటింగ్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మంత్రివర్గ విస్తరణపై అధిష్టానం ఇప్పటికే తన నిర్ణయాన్ని నిలిపివేసిందని.. ఎమ్మెల్యేలెవరూ ఈ విషయంలో అనుచిత వ్యాఖ్యలు చేయొద్దంటూ స్పష్టం చేశారు.
ఈ నేపథ్యంలో మంత్రి పదవి కోసం పోటీ పడుతున్న మంచిర్యాల ఎమ్మెల్యే అంతర్గత విబేధాలు తారాస్థాయికి చేరినట్లు తెలుస్తున్నది. మొన్నటి వరకు లోలోపల జరిగిన పోటీ.. పరస్పర వ్యాఖ్యల నేపథ్యంలో జిల్లాలో హాట్ టా పిక్‌గా మారింది. మంత్రి పదవి కోసం ఎవరి ప్రయత్నాలు వారు ముమ్మరం చేసినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో నిర్మల్ జిల్లాలో శనివా రం ఉమ్మడి జిల్లా అభివృద్ధిపై మంత్రి సీతక్క ఆధ్వర్యంలో సమీక్ష నిర్వహించారు. ఉమ్మడి జిల్లాలోని అందరు ఎమ్మెల్యేలు, జిల్లా ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యా రు. కాగా, మంచిర్యాల జిల్లాకు చెందిన ము గ్గురు అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఈ మీటింగ్‌కు గైర్హాజరవడం మరోసారి చర్చనీయాంశంగా మారింది. పార్టీలో విబేధాలు తారా స్థాయికి చేరిన నేపథ్యంలో ఎమ్మెల్యేలు మీటింగ్ రాలేదనే చర్చ నడుస్తున్నది.