మంచిర్యాల అర్బన్ : మంచిర్యాల ( Manchiryala ) పట్టణంలోని ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ, ట్రామా అండ్ క్రిటికల్ కేర్ ప్రైవేట్ ఆసుపత్రిలో ఓ వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులు వైద్యుల నిర్లక్ష్యమే ( Doctors Negligence ) కారణమంటూ ఆందోళన చేశారు.
పట్టణ సీఐ ప్రమోద్ రావు తెలిపిన వివరాల ప్రకారం వడ్లూరి శ్రీనివాస్ (53) అనే వ్యక్తికి కుడి కాలుకు ఇన్ఫెక్షన్ కావడంతో కొన్ని రోజుల క్రితం కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించి కాలుకు చికిత్స చేయించారు. అయినా ఇన్ఫెక్షన్ తగ్గడం లేదని పాదం తీసేశారన్నారు. తరువాత కాలును సైతం తీసేశారు. ఈ నెల 10న శ్రీనివాస్ అస్వస్థతకు గురి కావడంతో అదే రోజు ఉదయం 11 గంటల సమయంలో ఆసుపత్రి లో అడ్మిట్ చేశారు. బ్లడ్ తక్కువ ఉందని వైద్యం అందించారు.
చికిత్స పొందుతున్న సమయంలో హార్ట్స్ర్టోక్తో చనిపోయినట్టు వైద్యుడు తెలిపాడన్నారు. శ్రీనివాస్ పరిస్థితి ఎలా ఉందో కూడా చెప్పకుండా వైద్యులు నిర్లక్ష్యం గా వ్యవహరించడం వలనే శ్రీనివాస్ మృతి చెందాడని మృతుడి కొడుకు వల్లూరి శివ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు.