జన్నారం, ఫిబ్రవరి 19 : మందమర్రి మండలం బొక్కలగుట్ట వద్ద ఈ నెల 23 నుంచి 25వ తేదీ వరకు నిర్వహించే మైసమ్మ జాతర పోస్టర్లను సోమవారం స్థానిక పోలీస్‌స్టేషన్ ఆవరణలో ఆదివాసీ నాయక్‌పోడు సేవాసంఘం ఆధ్వర్యం లో ఎస్ఐ సతీశ్, హెడ్‌కానిస్టేబుల్ తుకారం, జిల్లా ఉపాధ్యక్షుడు భూమేశ్, యూత్ అధ్యక్షుడు ప్రభాకర్, వెంగయ్య విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు చిన్నయ్య, రాజన్న, రమేశ్, భూమేశ్ పాల్గొన్నారు.