నేరడిగొండ, ఏప్రిల్ 11 : అణగారిన వర్గాల అభ్యున్నతి, విద్యాభివృద్ధి కోసం జీవితాంతం కృషి చేసిన గొప్ప ఆదర్శప్రాయుడు, సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిబాఫూలే అని బోథ్ ఎమ్మెల్యే జాదవ్ అనిల్ కొనియాడారు. శుక్రవారం నేరడిగొండలో ఫూలే జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సామాజిక సమానత్వానికి, మహిళా విద్యకు మార్గదర్శకులు ఫూలే అని గుర్తు చేశారు. మాజీ ఎంపీపీ రాథోడ్ సజన్, వీడీసీ చైర్మన్ రవీందర్‌రెడ్డి, మాజీ సర్పంచ్ వెంకటరమణ, మాజీ ఉప సర్పంచ్ దేవేందర్‌రెడ్డి, నాయకులు సంతోష్‌సింగ్, రాజశేఖర్, లస్మన్న, ప్రతాప్‌సింగ్, బాబులాల్ తదితరులున్నారు.
ఎదులాపురం, ఏప్రిల్11: ఆడ పిల్లల చదువు కోసం ఫూలే దంపతులు ఏనలేని కృషి చేశారని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా అన్నారు. మహాత్మా జ్యోతిబాఫూలే జయంతిని పురసరించుకొని బీసీ స్టడీ సరిల్ ఆవరణలోని పూలే విగ్రహానికి ఎమ్మెల్యే పాయల్ శంకర్‌తో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం సత్యశోధక్ సమా జ్ పేరిట సొసైటీ ఏర్పాటు చేసి హకుల కోసం పోరాటాలు చేశారన్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ..మహిళలు చదువుకుంటేనే సమాజాభివృద్ధి సాధ్యమని తెలిపారు. డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, బీసీ వెల్ఫేర్ అధికారి రాజలింగు, తె లంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి బోరంచు శ్రీకాంత్‌రెడ్డి, బీసీ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చికలదత్తు, శ్రీనివాస్, అశోక్, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
ఆదిలాబాద్ జడ్పీ సమావేశ మందిరంలో బీసీ వెల్ఫేర్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అధికారిక జయంతి వేడుకల్లో కలెక్టర్ రాజర్షి షా, ఎమ్మెల్యే పాయల్ శంకర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముందుగా ఫూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ సం సృతి కళాకారులు జ్యోతిబాఫూలేను కీర్తిస్తూ పాటలు పా డారు. అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ఆర్డీవో వినోద్ కు మార్, బీసీ వెల్ఫేర్ అధికారి రాజలింగు, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, మాలీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుకుమా ర్ పెట్కులే, బీసీ సంఘం నాయకులు పాల్గొన్నారు.
నిర్మల్ అర్బన్, ఏప్రిల్ 11 : నిర్మల్ కలెక్టరేట్లో నిర్వహించిన జయంతి వేడుకల్లో జ్యోతిబాఫూలే చిత్రపటానికి అదనపు కలెక్టర్లు, జిల్లా అధికారులు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ కిశోర్ కుమార్ మాట్లాడుతూ సమాజంలో అస్పృశ్యత, అంటరానితనం, కుల వివక్ష లాంటి సామాజిక రుగ్మతలను నిర్మూలించేందుకు ఫూలే కృషి చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల అధికారి శ్రీనివాస్, ఎస్సీ సంక్షేమ అధికారి రాజేశ్వర్ గౌడ్, మైనార్టీ అధికార మోహన్ సింగ్, సీపీవో, సీపీవో జీవ రత్నం, రాంగోపాల్, నర్సింహారెడ్డి, కుల సంఘాల నాయకులు నర్సాగౌడ్, భాస్కర్, ప్రభాకర్, ముడుసు సత్యనారాయణ ఉన్నారు.