రెబ్బెన : చైత్ర పౌర్ణమి సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా రెబ్బెన మండలం శ్రీ కనక దుర్గా దేవి స్వయంభూ శ్రీ మహంకాళి దేవస్థానంలో మహంకాళీ అమ్మవారి జాతర ( Mahankali Jatara ) ఉత్సవాలు గురువారం నుంచి ప్రారంభమయ్యాయి. ఉదయం ప్రత్యేక పూజాది కార్యక్రమాలతో ఆలయ ప్రధాన అర్చకులు దేవర వినోద్ జాతర ఉత్సవాలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా శివ పార్వతుల కళ్యాణానికి తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి టీటీడీ సభ్యులు పట్టు వస్త్రాలు సమర్పించారు. వేద పండితులు పుసాల మహేష్ శాస్త్రి ఆధ్వర్యంలో శివ పార్వతుల కళ్యాణం వైభవంగా నిర్వహించారు. ఈ ప్రత్యేక పూజాది కార్యక్రమాలను తిలకించేందుకు భారీగా భక్తులు తరలివచ్చారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్న ప్రసాదాన్ని అందించారు.