ఆసిఫాబాద్‌టౌన్, మార్చి 8 : మండలంలోని పలు గ్రామాల్లో భక్తులు ఆలయాలకు వెళ్లి మొక్కులు చెల్లించుకున్నారు. మండలంలోని బూర్గుగూడ, గుండి, మోతుగూడ, గ్రా మాల్లో నిర్వాహకులు అన్నదానం నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని సందీఫ్ నగర్ శివాలయంలో శివపార్వతుల కళ్యాణం,శోభాయాత్ర ఘనంగా నిర్వహించారు. బురుగూడ శివాలయంలో శివ పార్వతుల కళ్యాణం అనంతరం రథోత్సవం వైభవంగా నిర్వహించారు.
కెరమెరి, మార్చి 8: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శుక్రవారం శ్రీ వేంకటేశ్వర స్వామి శోభయాత్ర వైభవంగా జరుపుకున్నారు. నెహ్రూనగర్‌లో శ్రీ వేంకటేశ్వర స్వామికి ఉదయం జలాభిషేకం నిర్వహించి అఖండ దీపారాధనతో ప్రత్యేక పూజలు చేశా రు. కెరమెరి మార్కెట్ మీదుగా శివాలయం వరకు శోభ యాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పూజారి మంజుల లక్ష్మన్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఆనంద్‌రావ్, ఆలయ కమిటీ నాయకులు ఎల్లప్ప, జగన్, మధుకర్, కోవ దేవ్‌రావ్ నాయకులు ఉన్నారు.
సిర్పూర్(టీ), మార్చి 8 : మండలంలోని వెంకట్రావ్‌పేట్, టోంకిని గ్రామ సమీపంలోని పెన్ గంగానదిలో భక్తులు పుణ్యస్నానం చేశా రు. ఆనంతరం టోంకిని హనుమాన్ , పలు ఆలయాల్లో భక్తులు పూజలు చేశారు.
దహెగాం, మార్చి 8 : మండలంలో దహె గాం,లగ్గాం,బీబ్రా,కొంచవెల్లి, హత్తిని, చిన్నరాస్పల్లి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు.
తిర్యాణి, మార్చి 8 : మండలంలోని గుడిపేట్ పంచాయితీ పరిదిలోని రమాశంకర్, గుడిగుట్ట సంఘమేశ్వర, చింతపల్లి పంచాయితీ పరిదిలోని చెలిమెల నాగోబా శివక్షేత్రం వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆసిఫాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు మండలంలోని పలువురు ప్రజాప్రతినిధులతో కలసీ ఆలయాలను సందర్శించారు. ఈ కార్యక్రమాలలో ఎంపీపీ మర్సుకోల శ్రీదే వి, జడ్పీటీసీ ఆత్రం చంద్రశేకర్, ఆత్రం సక్కు యూత్‌ఫోర్స్ జిల్లా అధ్యక్షుడు ఆత్రం వినోద్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
సిర్పూర్(యు) ఫిబ్రవరి 8 : మండల కేం ద్రంలోని మహాదేవ్ మందిరంలో భక్తులు మ హాదేవునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
లింగాపూర్,మార్చి 8 : మండలంలోని కొత్తపల్లి, లింగాపూర్, వంజారిగూడ, కింనాయక్తాండ, జాముల్ధార, కంచన్‌పల్లి తదిత ర గ్రామాల్లోని ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. వంజరిగూడ హనుమాన్ ఆలయంలో మహిళలు శివలీల అమృత్ గ్రం థం పారాయాణం చేశారు.
జైనూర్, మార్చి 8: మండల కేంద్రంలో మహాశివరాత్రి ఉత్సవాలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహదేవ్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం అన్నదానం చేశారు.
కౌటాల, మార్చి 8: మండలంలో శుక్రవారం ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజాది కార్యక్రమాలను నిర్వహించారు. మండల కేంద్రంలోని సదాశివపేట శివాలయంలో ఆలయ ప్రధాన అర్చకులు అంబేద శంకరయ్య, సంతోష్‌లు శివునికి మహా అభిషేకం, ఆరాధన, అర్చన, హారతి, శివపార్వతుల ఉత్సవ మూర్తుల ఊరేగింపు, శివపార్వతుల కళ్యాణం నిర్వహించారు.
కంకలమ్మ గుట్టపై ఆలయ కమిటీ చైర్మన్ సుల్వ కనకయ్య ఆధ్వర్యంలో హోమం, హారతి, కళ్యాణం, తాటిపల్లి కుర్తా వద్దగల హనుమాన్ ఆలయంలో ఆల య కమిటీ చైర్మన్ ఎల్ములే దత్తు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. తుమ్డిహట్టి వద్ద ప్రాణహతి నది తీరాన గల శ్రీ కార్తీక్ మహారాజ్ ఆలయంలో ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక పూజాది కార్యక్రమాలను నిర్వహించారు. విర్దండి వార్దా నది సమీపంలో ఆంజనేయ స్వామి ఆలయంలో జాతర ఉత్సవాలను నిర్వహించారు.
బెజ్జూర్, మార్చి 8 : మండల కేంద్రంలోని ఆలయ ప్రాంగణంలో మహాశిరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా భక్తులు మండలంలోని ప్రాణహిత నదికి వెల్లి పుణ్య స్నానాలు ఆచరించారు. కాగజ్‌నగర్‌కు చెందిన గోవింద్ లాల్, మంగిలాల్ అసావ బ్రదర్స్ ఆధ్వర్యంలో పులిహోర పంపిణీ మరియు శక్తి డైరీ డిస్ట్రిబ్యూటర్స్ సురేశ్, శ్రీనివాస్ వారి ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ చేశారు. రాత్రి 8 గంటలకు శిపార్వతుల కళ్యాణంను అంగరంగ వైభవంగా నిర్వహించారు.
చింతలమానేపల్లి , మార్చి 8 మండలంలోని కర్జెల్లి, ముసలమ్మగుట్ట శివాలయం, రణవెల్లి ఆంజనేయ స్వామి ఆలయం, శివపెల్లి, బూరుక్గూడ, హేటిగూడ ఆలయాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రాణహిత నదిలో గంగాదేవికి ప్రత్యేక పూజలు చేశారు.
రెబ్బెన, మార్చి 8 : మండలంలోని నంబాల శ్రీ ప్రసన్న పరమేశ్వరాలయం, దుగ్గపూర్ శివాలయం, గోలేటి శ్రీ కోదండ రామాలయం సముదాయంలోని శివాలయం, రెబ్బెన శివాలయం లలో భక్తులు స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీ పరమేశ్వరుడి రథోత్సవం కన్నుల పండువగా నిర్వహించారు. బెల్లంపల్లి ఏరియా జీఎం రవిప్రసాద్ దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. రెబ్బెన సీఐ చిట్టిబాబు, ఎస్ఐ చంద్రశేఖర్‌లు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.