ఎదులాపురం, జూలై 7 : ఆదిలాబాద్ పట్టణం లోని మహేశ్వరి టాకీస్ వద్ద గల ఓ టిఫిన్ సెం టర్లో టిఫిన్ చేసేందుకు వెళ్లిన వ్యక్తికి చేదు అనుభవం ఎదురైంది. ఆదిలాబాద్ జిల్లా మావ ల మండలంలోని దుబ్బగూడకు చెందిన రాజే శ్వర్ తన బామ్మర్దితో కలిసి మంగళవారం దోస తినేందుకు ఓ హోటల్‌కు వెళ్లాడు.
అక్కడ వడ్డిం చిన సాంబార్లో బల్లి కనిపించడంతో ఒకసా రిగా అవాకయ్యాడు. వెంటనే హోటల్ సిబ్బం దికి విషయం తెలియజేయగా, నిర్వాహకులు ‘తప్పు జరిగిపోయింది’ అని సమాధానం ఇచ్చి నట్లు రాజేశ్వర్ తెలిపారు. ‘బల్లి పడిన సాంబార్ తిని ఎవరైనా అస్వస్థతకు గురైతే కూడా ఇదే స మాధానం చెబుతారా?’ అని తాను ప్రశ్నించిన ట్లు పేరొన్నారు. హోటల్ నిర్వహకుల నిర్ల క్ష్యం వల్లే ఇటువంటి ఘటనలు జరుగుతు న్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.