మంచిర్యాల అర్బన్, ఫిబ్రవరి 25: పట్టభద్రుల, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా రెండు రోజులపాటు మద్యం దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్లు బంద్ చేస్తున్నట్లు ఎక్సైజ్ సూపరింటెండెంట్ నందగోపాల్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 25 సాయంత్రం 4 నుంచి 27 సాయంత్రం 4 గంటల వరకు మద్యం అమ్మకాలు నిలిపివేస్తున్నట్లు తెలిపారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.