ఇంద్రవెల్లి : ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం బుద్దనగకకు చెందిన కాంబ్లే జయశ్రీ ( Jayasri )గుండె సమస్య ( Heart condition ) తో హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చేరారు. శస్త్ర చికిత్స చేయాలని వైద్యులు తెలిపారు. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న విషయాన్ని తెలుసుకున్న కాంగ్రెస్ ఇంద్రవెల్లి పట్టణ అధ్యక్షులు సోన్ కాంబ్లే జితేందర్, ఇంద్రవెల్లి మార్కెట్ కమిటీ చైర్మెన్ ముకాడే ఉత్తమ్ కలిసి ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుపటేల్ దృష్టికి తీసుకెళ్లారు.
స్పందించిన ఎమ్మెల్యే ఆ మహిళ శస్త్ర చికిత్స నిమితం అవసరమైన రూ. 5 లక్షల ఎల్వోసి ( LOC ) ని సీఎం సహాయనిధి నుంచి ఉట్నూర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బాధితురాలు కుటుంబసభ్యులకు అందించారు. నిరుపేదలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం నిలుస్తుందని ఎమ్మెల్యే అన్నారు.