నార్నూర్ : టీబీ రహిత ( TB-free society ) సమాజానికి ప్రతిఒక్కరు కృషి చేయాలని డీటీసీవో డాక్టర్ సుమలత( DTCO Sumalatha) అన్నారు. సోమవారం నార్నూర్ మండలం తాడిహత్నూర గ్రామంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని సందర్శించారు. గ్రామస్తులతో కలిసి గోడ ప్రతులను ఆవిష్కరించి టీబీ వ్యాధి పట్ల గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు.
గ్రామాల్లో ఎవరికైన టీబీ వ్యాధి లక్షణాలు ఉంటే వెంటనే స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఒకవేళ టీబీ ఉన్నట్టు నిర్ధారణ అయితే వైద్యుల సూచన మేరకు వైద్య సలహాలతో పాటు ఉచితంగా పంపిణీ చేసే మందులను ఊపయోగించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని తెలిపారు.
ఎవరు కూడా టీబీ వ్యాధి పట్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఉచిత వైద్య సేవలను సద్వినియోగం చేసుకో వాలని కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రాంబాబు,హెచ్ఈవో తులసి దాస్, హెల్త్ సూపర్వైజర్ చౌహన్ చరణ్ దాస్, టీబీ కోఆర్డినేటర్ సుదర్శన్ ఎస్టీఎస్ లక్ష్మణ్ , ఏఎన్ఎం సింధు, కైలాష్, జవహర్, ఈశ్వర్, ఆశా కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.