ఆసిఫాబాద్ టౌన్,డిసెంబర్ 23 : మండలంలోని మాణిక్గూడ పరిసర ప్రాంతాల్లో చిరుత పులి సంచరిస్తున్నట్లు ఆసిఫాబాద్ రేంజ్ అధికారి గోవింద్ చంద్ సర్దార్ తెలిపారు. సోమవారం అటవీశాఖ అధికారులు గ్రామ పరిసర ప్రాంతాల్లోని అడవిలో చిరుత పులి అడుగులను గుర్తించారు. ఆయన మాట్లాడుతూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సాయంత్రం వేళ అటవీ ప్రాంతాల్లోకి వెళ్లకూడదన్నారు.
శబ్ధాలు చేసుకుంటూ పత్తి ఏరాలని, చేలల్లో విద్యుత్ వైర్లు అమర్చవద్దని, అలా చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎకడైనా చిరుత పులి లేదా పులి కనిపిస్తే వెంటనే తమకు సమాచారం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ రేంజ్ అధికారి యోగేశ్, బీట్ అధికారి రాజేశ్, యయానిమల్ ట్రాకర్స్ పాల్గొన్నారు.