కుభీర్ : క్రీడలు ( Sports ) మానవ జీవితానికి శారీరక, మానసిక, సామాజిక అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతాయని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ ( MLA Rama Rao Patel ) పేర్కొన్నారు. నిర్మల్ జిల్లా కుభీర్ మండలం బెల్గాం తండాలోని దాజీరావు క్రీడా ప్రాంగణంలో స్వర్గీయ దాజీరావు పటేల్ స్మారక క్రికెట్ టోర్నీ ( Cricket tourny ) ముగింపు సందర్భంగా విజేతలకు బహుమతులకు అందజేశారు.
ఆయన మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసం పెరుగుతుందని, క్రమశిక్షణ, జట్టుకృషి, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని అన్నారు. తద్వారా జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనే శక్తిని, సానుకూల దృక్పథాన్ని ఇస్తాయన్నారు. సంపూర్ణ ఆరోగ్య, మానసిక వ్యక్తిత్వ వికాసానికి క్రీడలు తోడ్పడతాయని, యువత క్రీడలను అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. దాజీరావు సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.
అనంతరం విన్నర్ ఆఫ్ టీమ్ గా నిలిచిన బెల్గాం తండా జట్టుకు రూ. 21 వేల నగదు, షీల్డ్, రన్నరప్‌గా నిలిచిన భైంసా జట్టుకు రూ. 11వేల నగదు, షీల్డ్‌లను అందజేశారు. ఈ కార్యక్రమంలో బైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ సిందే ఆనందరావు పటేల్, ఆత్మ చైర్మన్ సిద్ధంవార్ వివేకానంద, సర్పంచులు బందెల సత్యనారాయణ, మాన్కూరు సంజీవ్, జాదవ్ గోకుల్ దాస్, గోవర్ధన్, మాజీ వైస్ ఎంపీపీలు బాలాజీ పటేల్, బందెల శంకర్, వి. మోహన్, వడ్నం నాగేశ్వర్, ప్యాట లక్ష్మణ్, డాక్టర్ పి. సంతోష్ కుమార్, ఏషాల దత్తాత్రి, శేఖర్, క్రీడాకారులు, యువకులు పాల్గొన్నారు.