కాసిపేట : తమ సొంత భూమిని ఆక్రమించుకునేందుకు (Land violence) దౌర్జన్యానికి పాల్పడుతున్న వారి నుంచి తమకు ప్రాణహాని ఉందని మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం కేంద్రానికి చెందిన జనప అల్లిక ( Janapa Allika ) అనే మహిళ ఆందోళన వ్యక్తం చేసింది. శివారు సర్వే నెంబర్ 213 లోని రెండు ఎకరాల తమ భూమికి సంబంధించి సోమవారం ఆమె కుటుంబ సభ్యులు, గ్రామస్థులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించి గోడును వెల్లబుచ్చుకుంది.
భూమికి సంబంధిన పత్రాలు, సాగు తామే చేసుకుంటున్నామని వెల్లడించారు. డబ్బుల కోసం మల్లమ్మ అనే మహిళతో కలిసి భూమయ్య అనే వ్యక్తి తమ భూమిని ఆక్రమించాలని చూస్తున్నాడని ఆరోపించారు. వారి నుంచి తమకు ప్రాణ హాని ఉందని వాపోయారు. వారికి స్థానిక నాయకులు కుర్మ నర్సయ్య, లంక లక్ష్మణ్ అండగా నిలిచి తమను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు.
భూమి గొడవకు సంబంధం లేని గ్రామ పెద్ద మనుషులు, మండల అధ్యక్షులు రత్నం ప్రదీప్, స్థానికులు రత్నం లక్ష్మణ్, గోమాస సుధాకర్, కవితపై తప్పుడు ఆరోపణలు చేశారని వెల్లడించారు. రెండెకరాల భూమి తమ సొంతమని, ఎవరికీ సంబంధం లేదని స్పష్టం చేశారు. తమను బెదిరిస్తున్నారని వారి నుంచి రక్షణ కల్పించాలని రెవెన్యూ, పోలీసు అధికారులను ఆమె కోరారు.