జననేత, యూత్ ఐకాన్, ఐటీ, మున్సిపల్ శాఖ మాత్యులు కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) బుధవారం నిర్మల్ జిల్లాలో పర్యటించనున్నారు. అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డితో కలిసి రూ.1,157 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.
మంత్రి కేటీఆర్ ఉదయం 9.50 గంటలకు హెలీకాప్టర్ ద్వారా చేరుకొని ప్యాకేజీ 27 ఎత్తిపోతల పథకం
11.10 గంటలకు సోన్ మండలంలోని పాక్పట్లలో రూ.250 కోట్లతో నిర్మించనున్న ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ పనులకు శంకుస్థాపన చేస్తారు. మధ్యాహ్నం 12.15 గంటలకు నిర్మల్ పట్టణంలో రూ.10.15 కోట్లతో నిర్మించనున్న సమీకృత మార్కెట్‌కు.. రూ.62.50 కోట్లతో చేపట్టే పనులకు శంకుస్థాపన చేయనున్నారు. రూ.50 కోట్ల నిధులతో నిర్మల్ పట్టణంలో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణంతోపాటు ఇతర మౌలిక వసతుల కల్పన కోసం చేపట్టే పనులకు శంకుస్థాపన చేస్తారు. ఎన్టీఆర్ మినీ స్టేడియంలో మధ్యాహ్నం 12.55 గంటలకు ప్రగతి నివేదన సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం హైదరాబాద్ తిరిగి వెళ్తారు.
– నిర్మల్, అక్టోబర్ 3(నమస్తే తెలంగాణ)
నిర్మల్, అక్టోబర్ 3(నమస్తే తెలంగాణ) : ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు బుధవారం నిర్మల్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డితో కలిసి రూ.1,157 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ముందుగా ఉదయం 9.50 గంటలకు హెలీక్యాప్టర్ ద్వారా దిలావర్పూర్ మండలం గుండంపెల్లికి చేరుకుంటారు. గ్రామ శివారులోని గోదావరి నది వద్ద నిర్మించిన ప్యాకేజీ 27 ఎత్తిపోతల పథకం పంప్‌హౌస్‌ను స్విచ్ ఆన్ చేసి ప్రారంభిస్తారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా దిలావర్పూర్ గ్రామ శివారులో నిర్మించిన సిస్టర్న్ వద్దకు చేరుకుంటారు. ఇక్కడే పంపింగ్ ద్వారా కాలువల్లోకి సాగు నీరు చేరుతోంది. కాలువల్లోకి గోదావరి జలాలు చేరగానే మంత్రులు కేటీఆర్, ఇంద్రకరణ్‌రెడ్డిలు గంగమ్మకు వాయినం సమర్పించి పూజలు చేస్తారు.
అనంతరం 11.10 గంటలకు సోన్ మండలంలోని పాక్పట్ల గ్రామ శివారుకు చేరుకుంటారు. అక్కడే 40 ఎకరాల విస్తీర్ణంలో రూ.250 కోట్లతో నిర్మించనున్న ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ పనులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం నిర్మల్‌తోపాటు, నిజామాబాద్, జగిత్యాల జిల్లాల నుంచి వచ్చిన ఆయిల్ పామ్ సాగు చేస్తున్న రైతులతో నిర్వహించే సమావేశంలో మంత్రి పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 12.15 గంటలకు నిర్మల్ పట్టణంలోని పాత తహసీల్ కార్యాలయ స్థలం వద్దకు చేరుకుంటారు. అక్కడే రూ.10.15 కోట్లతో నిర్మించనున్న సమీకృత మార్కెట్‌కు శంకుస్థాపన చేస్తారు. ఇదే ప్రాంగణంలో మరికొన్ని అభివృద్ధి పనులకు సంబంధించిన శిలాఫలకాలను మంత్రి ఆవిష్కరిస్తారు. వీటిలో నిర్మల్ పట్టణంలో రూ. 2 కోట్ల టీయూఎఫ్ఐడీసీ నిధులతో నిర్మించే ధోబీఘాట్ పనులు, రూ.4 కోట్ల టీయూఎఫ్ఐడీసీ నిధులతో మౌలిక వసతుల కల్పన కోసం చేపట్టే పలు అభివృద్ధి పనులు ఉన్నాయి.
అలాగే పట్టణంలో మంచినీటి సరఫరా వ్యవస్థను మెరుగుపర్చేందుకు అమృత్ పథకంలో భాగంగా రూ.62.50 కోట్ల వ్యయంతో చేపట్టే పనులకు శంకుస్థాపన చేయనున్నారు. రూ.50 కోట్ల నిధులతో నిర్మల్ పట్టణంలో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణంతోపాటు ఇతర మౌలిక వసతుల కల్పన కోసం చేపట్టే పనులకు శంకుస్థాపన చేస్తారు. ఇలా మొత్తం రూ.1,157 కోట్లతో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేయనున్నారు. ఆయా పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం స్థానిక ఎన్టీఆర్ మినీ స్టేడియంలో మధ్యాహ్నం 12.55 గంటలకు నిర్వహించే ప్రగతి నివేదన సభలో మంత్రి కేటీఆర్ పాల్గొంటారు. కాగా.. మంత్రి కేటీఆర్ పర్యటనకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను స్థానిక మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, కలెక్టర్ వరుణ్రెడ్డిలు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. మంత్రి పర్యటనలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని ఆయా శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.