నార్నూర్, ఫిబ్రవరి 12 : బీఆర్ఎస్ పార్టీ ప్రతి ఒక్కరికీ అండగా ఉంటుందని కుమ్రం భీం ఆసిఫాబాద్ జడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మి అన్నారు. గాదిగూడ మండలంలో ఆదివారం విస్తృతంగా పర్యటించారు. గాదిగూడ ఎంపీపీ ఆడ చంద్రకళ-రాజేశ్వర్‌తో కలిసి గ్రామాలను సందర్శించా రు. మండలంలోని శివనార గ్రామంలో ఇటివల ఆత్రం కిషన్‌రావు మహారాజ్ ఆధ్వర్యంలో మూ డు నిరుపేద జంటలకు వివాహం జరిపించారు. ఆ వధూవరులకు కట్నకానుకలు అందించి ఆశీర్వదించారు. యేటా నిరుపేద జంటలకు పెండ్లి చేయడం హర్షణీయమన్నారు. మహారాజ్‌ను అభినందించారు.
లోకారి(కే), ఖండోరాంపూర్, ఖడ్కి గ్రామాల్లో ఇటీవల వివిధ కారణాలతో మృతి చెందిన బాధిత కుటుంబాలను పరామర్శించారు. వారి మృతికి గల కారణాలను తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలని, బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. ఆమె వెంట కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కనక యాదవ్రావ్, నార్నూర్ మండలాధ్యక్షుడు మెస్రం హన్మంత్‌రావు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు సయ్యద్ ఖాశీం, సర్పంచులు మెస్రం జైవంత్‌రావ్, మెస్రం దేవ్‌రావ్, కుమ్రం భగవంత్‌రావు, జాడి రవీందర్, తొడసం శ్రీను, జుగాదిరావ్, ందోర్ మోహన్, పుసం మారుతి, చంద్రహరి, బాదిరావ్‌పటేల్ తదితరులున్నారు.