ఉట్నూర్, అక్టోబర్ 7 : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని కెరమెరి జోడేఘాట్లో ఈ నెల 9వ తేదీన కుమ్రం భీం వర్ధంతి నిర్వహించనున్నట్లు ఐటీడీఏ పీవో వరుణ్రెడ్డి తెలిపారు. శుక్రవారం మండల కేంద్రంలో వర్ధంతికి సంబంధించిన పోస్టర్ విడుదల చేశారు. కార్యక్రమంలో ఐటీడీఏ ఏటీడబ్ల్యూఏసీ చైర్మన్ కనక లక్కేరావ్, నాయకులు పాల్గొన్నారు.