ఓపిక సహనమే ఉద్యోగికి పేరు తెచ్చిపెడుతుంది
పదవీ విరమణ చేసిన ఎంపిఓ మోహన్ సింగ్కు వీడ్కోలు
Nirmal | కుభీర్, ఆగస్టు 30: ప్రభుత్వ ఉద్యోగంలో చేరి నలభై ఏళ్లుగా ప్రజాక్షేత్రంలో ప్రజలతో మమేకమై ఉద్యోగ బాధ్యతలను నీతి నిజాయితీతో పాటు ఓపిక సహనానికి మారుపేరుగా ఎంపీ ఓ మోహన్ సింగ్ సేవలు అభినందించదగినవని జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శంకర్, ఎంపీడీవో సాగర్ రెడ్డి, తాసిల్దార్ శివరాజ్, రాష్ట్ర మార్క్ ఫెడ్ డైరెక్టర్, బీఆర్ఎస్ మండల నాయకుడు, సహకార సంఘం చైర్మన్ రేకుల గంగాచరణ్ తో పాటు పలువురు వక్తలు కొనియాడారు.
నిర్మల్ జిల్లా కుభీర్ మండల కేంద్రంలోని మండల పరిషత్ సమావేశ మందిరంలో శనివారం ఈనెల 31న పదవీ విరమణ పొందుతున్న ఎంపీఓ మోహన్ సింగ్ను వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ఆత్మీయులు, మండల పంచాయతీ కార్యదర్శులు, సహ ఉద్యోగులు, ఈజీఎస్ ఐకెపి సిబ్బంది, కార్యాలయం అనువిదాయక సిబ్బంది, మాజీ సర్పంచులు ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పిటిసిలు మోహన్ సింగ్ దంపతులను వేరువేరుగా సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. ఆయన సేవలను పలువురు కొనియాడుతూ మంచికి మారుపేరుగా సౌమ్యుడిగా మండలంలో చిరకాలంగా విధులు నిర్వహించిన మోహన్ సింగ్ ఏనాడు రాజకీయ ఒత్తిళ్లకు గురి కాలేదని కార్యాలయానికి పేదవాడు వచ్చినా సంపన్నులు వచ్చినా అందరినీ ఒకేలా రిసీవ్ చేసుకునే వారిని ప్రతి పంచాయతీ కార్యదర్శి ఆయన ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని సూచించారు. మండలంలోని 41 గ్రామ పంచాయతీలలో మోహన్ సింగ్ మంచివాడిగా పేరు సంపాదించుకొని నేడు పదవి విరమణ చేయడం అందరికీ బాధాకరంగానే ఉన్నప్పటికీ ప్రతి ఉద్యోగికి పదవి విరమణ సహజమని పేర్కొన్నారు. వారి భావి జీవితం ఆయురారోగ్యాలతో సమాజ సేవలో కొనసాగుతూ గడిచిపోవాలని కోరుకున్నారు.
మార్కెట్ కమిటీ చైర్మన్ గోనె కల్యాణ్, ఆత్మ చైర్మన్ సిద్ధం వార్ వివేకానంద, మాజీ ఎంపీపీలు తూమ్ రాజేశ్వర్, వడ్నం జ్యోతి నాగేశ్వర్, రాథోడ్ కమలేష్, మాజీ జెడ్పిటిసి శంకర్ చౌహాన్, బీఆర్ఎస్, కాంగ్రెస్, బిజెపి పార్టీల మండల అధ్యక్షులు ఎన్నిలా అనిల్, బషీర్, వేషాల దత్తాత్రి, పంచాయతీ కార్యదర్శులు అధ్యక్షులు విజయకుమార్, తోట సంజీవ్, కమల్ సింగ్, పాముల కిరణ్, ఏపీఓ హరిలాల్, పీహెచ్సీ వైద్యుడు విజయ్, ఆయా శాఖల అధికారులు సిబ్బంది, ఆయా గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.