కుభీర్ : మండల కేంద్రంలోని బీఆర్ఎస్ ( BRS ) కార్యాలయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR ) జన్మదిన వేడుకలను పార్టీ శ్రేణులు ఘనంగా జరుపుకున్నారు. మండల అధ్యక్షుడు ఎన్నిల అనిల్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంచిపెట్టారు. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రానున్నదని దీమాను వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యకర్తలు, నాయకులు సమన్వయంతో పనిచేసి సత్తా చాటాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నాయకులు కార్యకర్తలు నినాదాలు చేశారు. ఉద్యమ నాయకుడు పుప్పాల పిరాజి, మాజీ సర్పంచ్ జీ బాబు, దత్తు, దత్తు సింగ్, గంధం పోశెట్టి కార్యకర్తలు పాల్గొన్నారు.