నిర్మల్ అర్బన్, సెప్టెంబర్ 17 : స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ జెండా ఎగుర వేద్దామని బీఆర్ఆస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. నిర్మల్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ నాయకులు హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో కేటీఆర్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా కేటీఆర్ నాయకులతో దాదాపు గంటపాటు జిల్లా రాజకీయాలపై సుదీర్ఘంగా చర్చించారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. కేటీఆర్‌ను కలిసిన వారిలో జాన్సన్‌నాయక్, నిర్మల్ పట్టణ అధ్యక్షుడు మారుగొండ రాము, జీవన్‌రెడ్డి, టీఎల్ఎన్ చారి ఉన్నారు.