హత్నూర, జూలై 24 : సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం దౌల్తాబాద్‌లో తెలంగాణ తల్లి చౌరస్తా వద్ద గురువారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు భారీ కేక్ కట్ చేసి కేటీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. జన్మదినం పురస్కరించుకొని భారీ ఎత్తున పటాకులు కాల్చుతూ డీజే చప్పుల మధ్య బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు నృత్యాలు చేస్తూ సంబురాలు జరుపుకున్నారు.
అదేవిధంగా పేద ప్రజలకు గిఫ్ట్ ఏ స్మైల్‌లో భాగంగా దుప్పట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర లేబర్ వెల్ఫేర్ బోర్డు మాజీ చైర్మన్ ఉమ్మన్నగారి దేవేందర్ రెడ్డి, మాజీ ఎంపీపీ వావిలాల నరసింహులు, మండల పార్టీ అధ్యక్షుడు రామ్ చంద్రారెడ్డి, నాయకులు వీరేశం గౌడ్, అంబటి అర్జున్, నరసింహారెడ్డి, రమేష్ నాయక్, కౌడిపల్లి యాదగిరి, ఎల్చాల మధు, శివశంకర్‌రావు, శ్రీకాంత్, జగదీష్, అర్జున్, ఆగమయ్య, అజ్జు, కిషోర్, సురేందర్ రెడ్డి, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.