ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్.. మున్సిపల్, ఐటీ శాఖ మాత్యులు కల్వకుంట్ల తారకరామారావు పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలు, రైతులు, యువకు లు, యువజన సంఘాల నాయకుల ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించారు. కేక్‌లు కట్ చేశారు. పాఠశాల విద్యార్థులకు, దవాఖానలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. రక్తదాన శిబిరాలు నిర్వహించి, మొక్కలు నాటారు. ఖానాపూర్‌లో ఎమ్మెల్యే రేఖానాయక్ కేక్ కట్ చేయగా.. తాంసి మండలంలో ఎమ్మెల్యే బాపురావ్ మొక్కలు నాటారు. మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి కూడా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. బాసర సరస్వతీ అమ్మవారి ఆలయంలో బీఆర్ఎస్ నాయకులు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని ప్రత్యేక పూజలు చేశారు. బజార్హత్నూర్ మండలంలోని డేడ్రాలో గ్రామస్తులు ఐదెకరాల్లో నాలుగు వేల మునుగ మొక్కలు నాటి మునగవనంగా నామకరణం చేశారు. ఖతర్ దేశంలోని దోహాలో కూడా కేటీఆర్ బర్త్ డే వేడుకల సందర్భంగా బీఆర్ఎస్ నాయకుడు శ్రీధర్‌గౌడ్ గిఫ్ట్ ఏ స్మైల్‌లో భాగంగా 15 మంది బైక్ ఫుడ్ డెలివరీ బాయ్స్‌కు రూ.22 లక్షల ఉచిత ప్రమాద బీమా చేయించాడు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్.. ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పుట్టిన రోజు వేడుక లు సోమవారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ తన నివాసంలో సంబురాలు జరుపుకున్నారు. బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేశారు. ఖానాపూర్ ప్రభుత్వ దవాఖానలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం మొక్క లు నాటారు. తాంసి మండలంలోని గోట్కురిలో ఎమ్మెల్యే బాపురావ్, డీసీసీబీ చైర్మన్ భోజారెడ్డి మొక్కలు నాటారు. బీఆర్ఎస్ నియోజకవర్గ నాయకుడు భూక్యా జాన్సన్ నా యక్ తన నివాసంలో కేక్ కట్ చేశారు. ప్రభుత్వ దవాఖానలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. మెగా రక్తదాన శిబి రం నిర్వహించగా యువకులు, పార్టీ శ్రేణులు భారీ సంఖ్య లో పాల్గొని రక్తదానం చేశారు. మున్సిపల్ కార్యాలయంలో పారిశుధ్య సిబ్బందిని శాలువాతో సన్మానించి, స్వీట్ బాక్స్ లు అందజేశారు. సోన్ మండల కేంద్రం, నీలాయిపేట్లో కేట్ కట్ చేసి ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు పండ్లు పంచి పెట్టారు.
బాసర అమ్మవారి సన్నిధిలో బీఆర్ఎస్ నాయకులు ప్రత్యేక పూజలు చేశారు. కేటీఆర్ గోత్రంపై అర్చన చేయించి నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని కోరుతూ ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు నాయకులు తెలిపారు. అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి కూడా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. భగవంతుని దీవెనలతో ఎల్లప్పుడు సుఖ సంతోషాలతో సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ఆకాంక్షించారు. బజార్హత్నూర్ మండలంలోని మారుమూల డేడ్రా గ్రామంలో గ్రామస్తులు ఐదెకరాల్లో నాలుగు వేల మునుగ మొక్కలు నాటి మునగవనంగా నామకరణం చేశారు. ఆధారం లేని మాకు సీఎం కేసీఆర్ పోడు హక్కు పత్రాలు అందించినందుకు అభిమానాన్ని చాటుకున్నామని గ్రామ సర్పంచ్ భీంరావు పేర్కొన్నారు. ఖతర్ దేశంలోని దోహాలో కూడా కేటీఆర్ బర్త్ డే వేడుకలు నిర్వహించారు. బీఆర్ఎస్ నాయకుడు శ్రీధర్‌గౌడ్ గిఫ్ట్ ఏ స్మైల్‌లో భాగంగా కేటీఆర్ పిలుపు మేరకు 15 మంది ఫుడ్ డెలివరీ బాయ్స్‌కు రూ.22 లక్షల ఉచిత ప్రమాద బీమా కల్పించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా వారు కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
Ktr
నా హృదయంలో చిరస్థాయిగా ఉంటారు..
రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్
ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని ముక్రా(కే) గ్రామస్తులు నా హృదయంలో చిరస్థాయిగా ఉంటారని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సోమవారం ట్విట్టర్లో పోస్టు చేశారు. కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని యేటా ముక్రా(కే) గ్రామస్తులు మొక్కలు నాటి వంద శాతం రక్షిస్తున్నారని, ఇప్పటి వరకు తన జన్మదినాన్ని పురస్కరించుకొని 10 వేల మొక్కలు నాటారని ట్వీట్లో పేర్కొన్నారు. ముక్రా (కే)గ్రామస్తులు తన హృదయంలో చిరస్థాయిగా ఉండిపోతారని ట్విట్టర్ వేదికగా కేటీఆర్ ముక్రా(కే) గ్రామస్తులను అభినందించారు.