కుమ్రం భీం ఆసిఫాబాద్ : విద్యార్థులు ఉన్నత లక్ష్యాన్ని ఎంచుకుని సాధించే దిశగా ముందుకు సాగాలని జిల్లా అదనపు కలెక్టర్ వరుణ్ రెడ్డి అన్నారు. గురువారం జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ, షెడ్యూల్డ్ కులాల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పదవ తరగతి విద్యార్థులకు ఏర్పాటు చేసిన ప్రేరణ కార్యక్రమానికి హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు ఎంచుకునే లక్ష్యాలు ఉన్నతంగా ఉండాలని, వాటిని సాధించే దిశగా ఏకాగ్రతతో కృషి చేయాలని అన్నారు. పదో తరగతి విద్యార్థులు 100 శాతం ఉత్తీర్ణత సాధించేందుకు సన్నద్ధమవ్వాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి కె. సత్యనారాయణ రెడ్డి, జిల్లా షెడ్యూల్ కులాల సంక్షేమ శాఖ అధికారి సజీవన్, సైకియాట్రిస్ట్ కవిత, సంబంధిత శాఖల అధికారులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.