నార్నూర్, జూలై 29 : ప్రతి ఒక్కరు ఆధ్యాత్మిక భావాలను అలవర్చుకోవాలని ఆదిలాబాద్ జిల్లా జడ్పీ మాజీ చైర్మన్ రాథోడ్ జనార్ధన్ అన్నారు. అదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం చోర్ గావ్ గ్రామంలో కొలువుదీరిన శివుని ఆలయంలో నాగుల పంచమి వేడుకలను వైభవంగా మంగళవారం నిర్వహించారు. జిల్లా నలుమూల ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిట లాడింది.
పాము పుట్టలు పాలు పోసి నైవేద్యాలు, కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు.
రాములు మూర్తి మహారాజ్ ఆశీస్సులు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ మాజీ చైర్మన్ ముఖ్య అతిథిగా పాల్గొని ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ ఆధ్యాత్మిక భావాలను అలవర్చుకోవాలని దీంతో మనసుకు ప్రశాంతత లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు, నాయకులు పాల్గొన్నారు.