కొమురంభీం ఆసిఫాబాద్ : జిల్లాలోని పలు ప్రాంతాల్లో బుధవారం అకాల వర్షం కురిసింది. రెబ్బన, వాంకిడి, ఆసిఫాబాద్, సిర్పూర్(టీ), కాగజ్‌నగర్, దహేగాం మండలాల్లో తేలికపాటి వర్షం కురిసింది. రెబ్బనలో 7.5 మీల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కొద్ది గంటల పాటు విద్యుత్‌కు అంతరాయం ఏర్పడింది. వర్షపు జల్లులకు మామిడి తోటలు, మొక్కజొన్న చేలు, వరి పంటలు దెబ్బతిన్నాయి. బలంగా వీచిన గాలుల ప్రభావం కారణంగా ఆదిలాబాద్ జిల్లాలోని సిరికింద మండలంలో పలు ఇండ్ల ఇనుప రేకులు ఎగిరిపోయాయి. అదృష్టవశాత్తు ఎవరికీ గాయలు కాలేదు.