ఆసిఫాబాద్ అంబేద్కర్ చౌక్, సెప్టెంబర్ 26: పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆసిఫాబాద్ మున్సిపల్ కమిషనర్ గజానంద్ అన్నారు. స్వస్వేచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా శుక్రవారం జిల్లా కేంద్రంలోని కొట్నక భీం రావ్ చిల్డ్రన్ పార్కులో ప్రత్యేక పారిశుధ్య పనులు చేపట్టినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా ఈ నెల 17వ తేదీ నుండి వచ్చే నెల 2వ తేదీ వరకు పట్టణంలోని వివిధ వార్డులలో పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. పట్టణ వాసులు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రతలు పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ సర్వర్, టీఎంసి అరుణ, జవాన్, తదితరులు ఉన్నారు.