కుమ్రం భీం ఆసిఫాబాద్ : ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమం, అభివృద్ధికి అనేక కార్యక్రమాలు ప్రవేశపెట్టి అమలు చేస్తుందని జిల్లా అదనపు కలెక్టర్ వరుణ్ రెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని జిల్లా మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ కార్యాలయ ఆవరణలో ప్రభుత్వం నుంచి మంజూరైన దివ్యాంగుల సహాయ ఉపకరణాలు రెట్రోఫిట్టెడ్ మోటర్ వెయికిల్ , లాప్ టాప్, స్మార్ట్ ఫోన్స్ ను ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కుతో కలిసి లబ్ధిదారులకు అందజేశారు.
ఈ సందర్భంగాఅదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. దివ్యాంగుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఇందులో భాగంగా దివ్యాంగుల స్వయం ఉపాధి కోసం ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేసే విధంగా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి పథకాలను లబ్ధిదారులకు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి సావిత్రి, జెడ్. పి. టి. సి. అరిగెల నాగేశ్వరరావు, ఆసిఫాబాద్ ఎంపీపీ మల్లికార్జున రావు, ఎఫ్. ఆర్. ఓ. రవి సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.