జైనూర్, డిసెంబర్ 26. జైనూరు మండలంలోని మార్లవాయిలో ఐసీటీ(ICT)గా విధులు నిర్వహిస్తున్న గేడం లక్ష్మి(Gedam Laxmi) జిల్లా అధ్యక్షురాలుగా నియమితులయ్యారు. పదోన్నతి పొందిన లక్ష్మిని పవర్ గూడ యువ చైతన్యం యుత్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు గేడం భరత్, గేడం బాలే రావు ఆమెను సన్మానించారు. నేటి సమాజానికి కంప్యూటర్ విద్య అత్యవసరమని, ఎంతో కష్టపడి ఒక గిరిజన యువతి కంప్యూటర్ విద్య నేర్చుకొని గత మూడు సంవత్సరాల నుంచి విద్యార్థులకు మెలకువలు నేర్పిస్తున్నారని వెల్లడించారు.
ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులకు కంప్యూటర్ నేర్పిస్తూ ICT లో జిల్లా అధ్యక్షురాలుగా నియమితులైన గేడం లక్ష్మి ఆదివాసి సమాజానికి గర్వకారణమని పావర్ గూడా గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గిరిజనులు టీచర్లుగా ఎంపికవ్వడం గొప్ప విషయం కాగా.. గేడం లక్ష్మీని ICT అధ్యక్షురాలుగా నియమించడం మరింత గొప్ప విషయమని యూత్ సభ్యులు అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, పటేల్ దేవారిలు, మహిళలు యూత్ సభ్యులు పాల్గొన్నారు.