Vankidi News | విద్యార్థుల్లో పఠన సంస్కృతి అలవర్చాలని ఇందాని కాంప్లెక్స్ సెక్రెటరీ నవీన్ అన్నారు. వాంకిడి ఎంపీపీఎస్ బెండారా, జడ్పీహెచ్ఎస్ ఇందాని, ఏహెచ్ఎస్ బంబార కాంప్లెక్స్ పరిధిలో 4, 5 వ తరగతి విద్యార్థులకు రూమ్ టూ రీడ్ సంస్థ అందించిన బ్లూ, ఎల్లో కలర్ పుస్తకాలలోని ఉన్న అంశాలపై పోటీలు నిర్వహించినట్లు తెలిపారు.
ఈ పోటీల్లో తెలుగు విభాగంలో ఇందాని కాంప్లెక్స్ నుండి నాగోసే లక్ష్మి (ఎంపీపీఎస్ ఒడ్డర వాడ), బాంబార కాంప్లెక్స్ నుండి శివానీ (ఎంపిపిస్ సోనాపూర్), ఇంగ్లీష్ విభాగంలో ఇంధానీ కాంప్లెక్స్ నుండి ఆకాశ్ (ఎంపిపిఎస్ లెండిగూడ), బాంబారా కాంప్లెక్స్ నుండి శివాని (ఎంపీపిస్ సొనాపూర్) విజేతలుగా నిలిచారు.
ప్రథమ స్థానం లో ఉన్న ఇద్దరు విద్యార్థులను జిల్లా స్థాయిలో పోటీలకు ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్రీనివాస్, సంతోష్, రవి, సుశీల్, సాయి కుమార్, అజయ్, అరవింద్, శంభు, మహేందర్, సచిన్, వినోద్, క్లస్టర్ రిసోర్స్ పర్సన్ దుర్గం సందీప్ తదితరులు పాల్గొన్నారు.