వారసంతలో రెండెకరాల్లో నిర్మాణానికి కసరత్తు
రూ. 4.5 కోట్ల నిధులు కేటాయించిన సర్కారు
త్వరలో టెండర్లు పిలిచి పనులు ప్రారంభించే అవకాశం
అందుబాటులోకి వస్తే ప్రజలు వ్యాపారులకు మేలు
సీసీసీ నస్పూర్, అక్టోబర్ 2;నస్పూర్ మున్సిపాలిటీలోని వారసంతలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 4.5 కోట్లు కేటాయించింది. జనాభా ప్రాతిపదికన రెండెకరాల్లో ఏర్పాటు చేయనుండగా, త్వరలోనే టెండర్లు పూర్తి చేసి పనులు ప్రారంభించనున్నది. ఇది అందుబాటులోకి వస్తే ప్రజలకు కూరగాయలు, పాలు, పండ్లు, చికెన్, మటన్, తదితర సరుకులన్నీ ఒకేచోట లభించే అవకాశముండగా, వ్యాపారులకూ సౌకర్యవంతంగా ఉంటుంది.
వారసంతలు.. రోడ్ల వెంటే విక్రయాలు..
మున్సిపాలిటీలో వారసంతలతో పాటు రోడ్ల వెంటే కూరగాయలు, మాంసం విక్రయాలు జరుగుతున్నాయి. ఇదివరకు సింగాపూర్, తాళ్లపల్లి, తీగల్పహాడ్, నస్పూర్ పంచాయతీలుగా కొనసాగాయి. తీగల్పహాడ్ మినహా ఈ గ్రామ పంచాయతీల్లో వారసంతలు ఉన్నాయి. వారంలో నాలుగు రోజులు కొనసాగే సంతల్లో ప్రజలు కూరగాయలు కొనుగోలు చేస్తున్నారు. మిగిలిన మూడు రోజులు ఆయా ప్రాంతాల్లో రోడ్లపై వ్యాపారుల వద్ద కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ నాలుగు పంచాయతీలను కలుపుకుని నస్పూర్ మున్సిపాలిటీగా ఏర్పాటు చేయడంతో సౌకర్యాలు ఒక్కొక్కటిగా మెరుగుపడుతున్నాయి.
4.5కోట్లతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్..
ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కోసం జనాభా ప్రతిపాదికన ప్రభుత్వం నిధులను మంజూరు చే సింది. మున్సిపాలిటీలో దాదాపు 80వేల వర కు జనాభా ఉంటుంది. దీని ఆధారంగా రూ. 4.5కోట్ల నిధులను కేటాయించింది. ఈ మా ర్కెట్లో కూరగాయలు, పాలు, పండ్లు, చికెన్, మటన్, నిత్యవసరాల కోసం సూపర్ మార్కె ట్ కూడా ఏర్పాటు చేయనున్నారు.మార్కెట్ అందుబాటులోకి వస్తే అటు ప్రజలకు, ఇటు వ్యాపారులకు సౌకర్యవంతంగా ఉంటుంది.
అందరికీ అందుబాటులో మార్కెట్..
ప్రజలకు సౌకర్యంగా ఉం డడానికి ప్రభు త్వం మా ర్కెట్ నిర్మించడానికి నిర్ణయించింది. అందరికి అ నుకూలంగా ఉండే స్థలా న్ని ఎంపిక చేస్తు న్నం. మార్కెట్ అందుబాటులోకి వస్తే ప్రజలు ఒకే చోట నిత్యవసర వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. త్వరలోనే టెండర్లు పూర్తి చేసి పనులు ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటాం.